కృష్ణహోమ్

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

క‌ల్తీ మ‌నుషులు, నకిలీ పార్టీ వైసీపీ కి డ్రామాలు ఆడాటం కొత్త‌కాద‌ని…ఆనాడు బాబాయి హ‌త్య కేసు స‌మ‌యంలో, కోడి క‌త్తి డ్రామా, గుల‌క‌రాయి డ్రామా ఆడార‌ని..ఇప్పుడు రాష్ట్రంలో అల‌జ‌డ‌లు సృష్టించటానికి పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డైరెక్ష‌న్ లో వైసిపి నాయ‌కులు త‌మ ఇళ్ల ను తామే త‌గ‌ల‌బెట్టుకుని నింద వేరే వాళ్ల‌పై వేసే స‌రికొత్త డ్రామాకు తెర‌దీశార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

వస్తున్న భారీ పెట్టుబడులు చూసి ఓర్వలేకే…

అలాగేమంత్రి నారా లోకేష్ నాయ‌క‌త్వంలో త‌న ఆద్వ‌ర్యంలో జోగి ర‌మేష్ ఇళ్లు త‌గ‌ల‌బెట్ట‌డం జ‌రిగిందని వైసిపి నాయ‌కులు చేస్తున్న దుష్ప్ర‌చారాన్నిఖండించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని, సుమారు 734 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నాయని తెలిపారు.

దీని ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. పెట్టుబడుల సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయంగా అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు

రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం చేసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మరోవైపు నారా చంద్రబాబు నాయుడు శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగ‌య్యే స‌మ‌యంలో మ‌ళ్లీ పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌ళ్లీ కుట్ర‌లు కుతంత్రాలు మొద‌ల‌య్యాయన్నారు.

టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు….

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించాల‌నే ఉద్దేశ్యంతో వైసిపి నాయ‌కుల‌తో సీఎం చంద్ర‌బాబు ను అస‌భ్య ప‌దజాలంతో దూషించి టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా జ‌గ‌న్ ప్ర‌ణాళిక ర‌చించాడన్నారు. అయితే త‌మ నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మ‌న్వ‌యంతో వుండాల‌ని దిశానిర్దేశం చేయ‌టం జ‌రిగింద‌న్నారు.

సైకో మ‌న‌స్త‌త్వం క‌లిగిన వై.ఎస్.జ‌గ‌న్ ఎక్క‌డ ఆనందంగా వున్న త‌ట్టుకోలేడంటూ…ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ది చెంద‌కూడ‌ద‌నే కంకణం క‌ట్టుకుని కొత్త డ్రామాకి తెర‌దీశాడ‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి వైలెన్స్ కోరుకుంటే…సీఎం చంద్ర‌బాబు సైలెన్స్ కోరుకుంటార‌న్నారు. రాష్ట్రం ప్ర‌శాంతంగా వుండాలి…పెట్టుబ‌డులు రావాలి..రాష్ట్రం సంక్షేమం. అభివృద్ది ప‌రంగా ముందుండాల‌నే ల‌క్ష్యంతో సీఎం చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.

రాష్ట్రాభివృద్దిని అడ్డుకునేందుకు కులాన్ని తీసుకురావ‌టం…దూరంగా వున్న వ్య‌క్తుల‌కు లేనిపోని నింద‌లు ఆపాదించ‌టం వై.ఎస్.జ‌గ‌న్ వికృత చేష్ట‌ల‌కు నిద‌ర్శ‌నమ‌న్నారు. ఆదివారం విజ‌య‌వాడ లో జ‌రిగిన సంఘ‌ట‌న కి సంబంధించి వైసిపి నాయ‌కులు కొత్త డ్రామా మొద‌లుపెట్టార‌న్నారు.

త‌మ కార్య‌క‌ర్త‌లు శాంతియుతంగా ధ‌ర్నా చేయ‌టానికి వెళ్లితే….వైసిపి నాయ‌కులు రెచ్చ‌గొట్టి రాళ్లు విసిరితే..త‌మ మ‌హిళ కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలు కావ‌టం జ‌రిగింద‌న్నారు. సొంత ఇళ్ల‌నే త‌గ‌ల‌పెట్టుకుని ఎదుటి వారిపై నింద‌లు వేసేందుకు వైసిపి నాయ‌కులు కొత్త డ్రామాకి తెర‌దీశారన్నారు.

కాపు కులాన్ని వాడుకుంటున్నారు….

అదే విధంగా వైసిపి నాయ‌కులు కాపు నాయ‌కుల‌ను రెచ్చగొట్టాల‌ని చూస్తున్నార‌ని, తామంతా అన్న‌ద‌మ్ములా వుంటామ‌ని, విజ‌య‌వాడ న‌గ‌రంలో చూస్తే వంగ‌వీటి మోహ‌న రంగా ను కాపు నాయ‌కుడిగా కాదు..బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల నాయ‌కుడిగా గౌర‌వించుకుంటున్నామ‌న్నారు.

ఆయ‌న చ‌నిపోయిన స‌మ‌యంలో హ‌త్య రాజ‌కీయాలు చేసి….ర‌క్త‌సిక్త చ‌రిత్ర వున్న కొంద‌రు విజ‌య‌వాడ నాయ‌కులు ఇవాళ చూస్తే ఎవ‌రి చుట్టూ వున్నారో అంద‌రికీ తెలుసున‌న్నారు. వంగ‌వీటి మోహ‌న రంగాను వై.ఎస్.జ‌గ‌న్ తండ్రి వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎద‌గ‌నీయ‌కుండా అడ్డుకున్నార‌ని తెలిపారు.

రంగా హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయిలు అంద‌రూ వై.సి.పిలో ప‌ద‌వులు తెచ్చుకుని విజ‌య‌వాడ లో తిరుగుతున్నారన్నారు.వైసిపి నాయ‌కులు జోగి ర‌మేష్, అంబ‌టి రాంబాబు వంటి వారిని ప‌ట్టించుకునే స్థాయిలో మంత్రి నారాలోకేష్.. తాను లేమ‌న్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ది కోసం దేశ విదేశాలు తిరుగుతుంటే…తాను పార్ల‌మెంట్ లో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం శ్ర‌మిస్తున్నట్లు తెలిపారు.

పార్ల‌మెంట్ లో ఆదివారం జ‌రిగిన‌ బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాల్గొన‌ట్లు తెలిపారు. త‌న ఆధ్వర్యంలో దాడి జ‌రిగింద‌ని చెబుతున్న వాళ్ల ద‌గ్గ‌ర ఎటువంటి ఆధారం లేద‌న్నారు.త‌మ పార్టీ కార్య‌క‌ర్తలు శాంతియుతంగా ధ‌ర్నా చేయ‌టానికి వెళ్లార‌ని..అక్క‌డ వాళ్ల‌ని వైసిపి నాయ‌కులే రెచ్చ‌గొట్టార‌ని తెలిపారు.

వైసిపి నాయ‌కులు చేసిన త‌ప్పులను ఎత్తిచూపుతూ పోలీస్ క‌మిష‌న‌ర్ కి త‌మ నాయ‌కులు విన‌తి ప‌త్రం కూడా ఇవ్వ‌టం జ‌రిగిందన్నారు.ఆనాడు సీఎం చంద్ర‌బాబు ఇంటిపై, టిడిపి కార్యాల‌యంపై, కొమ్మారెడ్డి ప‌ట్టాబి రామ్ ఇంటిపై దాడి చేసిన‌ప్పుడు ఆ ఇళ్ల‌లో కుటుంబ స‌భ్యులు, పిల్ల‌లు లేరా? పార్టీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు లేరా? అంటూ వైసిపి నాయ‌కుల్ని ప్ర‌శ్నించారు.

వైసిపి నాయ‌కుడు జోగి ర‌మేష్ ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో తానులేన‌ని. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది పథం దిశ‌గా తీసుకువెళ్లే ప‌నుల్లో మునిగివున్న‌ట్లు తెలిపారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంతో పాటు .కొండ‌పల్లి రైల్వే స్టేష‌న్..కొండ‌పల్లి డ్రైనేజీ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం. కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు.

జగన్ డైరెక్షన్ లో చిల్లర మాటలు

జోగి ర‌మేష్ పై దాడి చేయించాల్సిన అవ‌సరం లేద‌ని స్ప‌ష్టం చేశారు.జ‌గ‌న్ డైరెక్ష‌న్ లో న‌డిచే వైసిపి నాయ‌కులు చిల్ల‌ర మాట‌లు మానుకోవాల‌ని హెచ్చ‌రించారు.అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రతీకార రాజకీయాలు వద్దన్నార‌ని…అందుకే20 నెల‌ల నుంచి త‌మ పార్టీ నాయ‌కులు ఎంతో ఓపిగ్గా వుంటూ వైసిపి నాయ‌కుల అరాచ‌కాల‌ను బ‌రిస్తున్నార‌న్నారు.

సీఎం చంద్ర‌బాబు , కుటంబ స‌భ్యుల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తే.. టిడిపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌శాంతంగా ధ‌ర్నాచేశారే కానీ ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. వై.ఎస్.జ‌గ‌న్ స‌తీమ‌ణి వై.ఎస్.భార‌తీరెడ్డి పై సోష‌ల్ మీడియాలో కామెంట్ చేస్తే త‌మ పార్టీ కార్య‌క‌ర్త అయినా కూడా వ‌దిలిపెట్ట‌కుండా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకున్న ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబు సొంత‌మ‌న్నారు.

అధికారంలోకి రాగానే విధ్వంసంతోనే వైసిపి ప్ర‌భుత్వం ప‌రిపాల‌న మొద‌లు పెట్టింద‌ని, ఆ సంగ‌తి మ‌ర్చిపోయి బొత్స నారాయ‌ణ మాట్లాడ‌టం విడ్డూరంగా వుంద‌న్నారు.ప్రతీకార రాజకీయాలకు తాము దూరమని, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

కోటి సభ్యత్వాలున్న తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అభివృద్ధి, శాంతి మార్గాన్నే అనుసరిస్తుందని తెలిపారు. లోక్‌సభ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న తాను కూడా విజయవాడ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని చెప్పారు.

Related posts

హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ఖరారు

Satyam News

బిల్ గేట్స్ పర్యటన కోసం అంతా సిద్ధం

Satyam News

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

Leave a Comment