26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

#Wanaparthy

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్  సురభి అన్నారు. గురువారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) డైరీ, జిల్లా అధ్యక్షుడు మాధవరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్, లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ సమాజంలో జర్నలిజం నాలుగో స్తంభం లాంటిదని,జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వార్తలను అందించాలని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారమయ్యే విధంగా ఉండాలని సూచించారు. జర్నలిజాన్ని ,వాటి విలువలను కాపాడాల్సిన బాధ్యత,ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వార్తలు అందించాలన్నారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు కానివారిపై దృష్టి సారిస్తామన్నారు, జర్నలిస్టుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనిచేసే జర్నలిస్టులకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఈ సందర్భంగా ఆమె తెలిపారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డు ఇవ్వాలని, జర్నలిస్టు భవన్ కు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయేలా చూడాలని,కలెక్టర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో డి పి ఆర్ ఓ సీతారాములు, ఎస్పి పిఆర్ఓ రాజ గౌడు,జాతీయ కౌన్సిల్ సభ్యులు మల్యాల బాలస్వామి,రాష్ట్ర హౌస్ సైట్  కో కన్వీనర్ జి శ్రీనివాసరావు,సీనియర్ విలేకరి పోలిశెట్టి బాలకృష్ణ ,నాగేంద్ర చారి, వెంకట్ గౌడు, జిల్లా కోశాధికారి మన్యం, జిల్లా కార్యదర్శి ,కమల్ రెహమాన్ చిన్న రాజు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు పికిలి రాము, తిరుపతయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నరసింహ రాజ్, ప్రచార కార్యదర్శి రవి, పట్టణ అధ్యక్షులు  తైలం అరుణ్ కుమార్ కార్యదర్శి సి ఆంజనేయులు లోకేష్ పాల్గొన్నారు. పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్   

Related posts

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

Satyam News

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News

ఆస్తి కోసం సొంత నేతపై వైసీపీ లీడర్‌ గొడ్డలి వేటు…!!

Satyam News

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

మీ సేవ కేంద్రాలతో అత్యుత్తమ డిజిటల్ సేవలు

Satyam News

అమరావతిలో L&T పైపులకు నిప్పు పెట్టింది ఎవరు?

Satyam News

Leave a Comment