కృష్ణహోమ్

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

#secretariat

రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సెలవు దినంగా ప్రభుత్వం గతంలో ప్రకటించడం జరిగిందని అయితే శుక్రవారం నెలవంక(Sighting of the moon)కనిపించని కారణంగా వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి విజ్ఞప్తి మేరకు రంజాన్ సాధారణ సెలవును ఈనెల 20వ తేది శుక్రవారానికి బదులు 21వ తేదీ శనివారానికి మార్చినట్టు ఆయన వెల్లడించారు.కావున 20వ తేది శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యదావిధిగా పనిచేస్తాయని సిఎస్ స్పష్టం చేశారు.

అదే విధంగా షాపులు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881 కు అనుగుణంగా రంజాన్ సాధారణ సెలవును 20వ తేది శుక్రవారానికి బదులుగా 21వ తేది శనివారానికి మారుస్తూ జిఓఆర్టి సంఖ్య:613 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News

“బిగ్ బాస్” నాకు ఎంతో ఇచ్చాడు: టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

Leave a Comment