25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

నీలోఫర్ నర్సింగ్ ఆఫీసర్లకు గణతంత్ర గౌరవం

#NelofarHospital

“అమ్మ ఒడిలాంటి నీలోఫర్ దవాఖానలో.. అమ్మలాంటి ప్రేమని పంచుతున్న నర్సింగ్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. 77వ గణతంత్ర దినోత్సవం సాక్షిగా వారిని గౌరవించుకోవడం గర్వంగా ఉంది” అని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్ అన్నారు. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణలో నీలోఫర్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ క్రెడిట్ అంతా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిదేనని కొనియాడారు. “డాక్టర్లు చికిత్స రాస్తే, దాన్ని అమలు చేసి, పేషెంట్ కోలుకునేదాకా కంటికి రెప్పలా కాపాడేది నర్సులే. అత్యవసర సమయాల్లో వాళ్లు చూపిస్తున్న అంకితభావం అద్భుతం. ఇలాంటి అవార్డులతో వారిలో మరింత ఉత్సాహం పెరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ బాలమణి, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ సముద్ర, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అమృతతో పాటు నర్సింగ్ ఆఫీసర్లు స్వాతి, లక్ష్మణ్, దీపిక, సంధ్యారాణిలను సర్టిఫికెట్, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆనంద్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TGGDA) రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ నాగ జ్యోతి తదితరులు పాల్గొని సిబ్బందిని అభినందించారు.

Related posts

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News

డోనాల్డ్ ట్రంప్ ఏసుక్రీస్తు అవతారమా?

Satyam News

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Satyam News

శ్వేత సౌధం లో కాల్పులు: ఉలిక్కిపడ్డ ట్రంప్

Satyam News

Leave a Comment