చిత్తూరుహోమ్

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

#FoodSeftey

భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటళ్లులో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆహార భద్రతా సిబ్బంది సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, తినుబండారాల దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించారు.

వాటిని నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని హోటల్స్ లలో శాంపుల్స్ కలెక్ట్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. శాంపుల్స్ పరిశీలనకు పంపామమని… ఫుడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే కచ్చితంగా ఆ హోటల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

Related posts

రాష్ట్రంలో ద‌శ‌ల వారీగా భూముల రీసర్వే

Satyam News

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News

బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

Satyam News

విద్యార్థుల భవిష్యత్‌ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Satyam News

రేప్ కేసులపై సుమోటోగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

Leave a Comment