సంపాదకీయంహోమ్

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

#NaraLokesh

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, ఈ ఎయిర్‌పోర్టుతో పాటు రూపుదిద్దుకుంటున్న ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుసిటీ ఇప్పుడు స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది.

కేవలం విమానాలు ల్యాండ్ అవ్వడమే కాదు, ప్రపంచ విమానయాన రంగానికి కావాల్సిన నిపుణులను తయారుచేసే అతిపెద్ద శిక్షణ కేంద్రంగా ఉత్తరాంధ్రను తీర్చిదిద్దాలనే మంత్రి లోకేష్ దీర్ఘకాలిక ఆలోచనకు ఇది సజీవ రూపం. GMR గ్రూప్, మాన్సాస్ – MANSAS ట్రస్ట్ భాగస్వామ్యంతో ఏరోసిటీ ప్రాంగణంలోనే దాదాపు 136 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ AAD ఎడ్యుసిటీ…రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఏవియేషన్ ఎడ్యుకేషన్ మ్యాప్‌లో నిలబెట్టబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నప్పటికీ,అందుకు తగ్గట్లుగా స్కిల్డ్ మ్యాన్‌పవర్ లభించకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ కొరతను గుర్తించిన నారా లోకేష్, కేవలం సాధారణ రన్ వే లు, టెర్మినల్స్ కట్టడంతో పని అయిపోలేదని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మానవ వనరులను సృష్టించడమే అసలైన అభివృద్ధి అని భావించారు.

ఇందులో భాగంగానే గ్లోబల్ ఏవియేషన్ వర్క్‌ఫోర్స్‌లో కనీసం 25 శాతం మంది తెలుగువారే ఉండాలి అనే స్పష్టమైన లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలో కాకుండా విద్య, పరిశోధన, పారిశ్రామిక శిక్షణ మరియు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు ఒకేచోట లభించేలా చైనా తరహా అభివృద్ధి చెందిన దేశాలలోని క్లస్టర్ ఆధారిత మోడల్‌ను ఇక్కడ అమల్లోకి తెస్తున్నారు.

మాన్సాస్ ట్రస్ట్ రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా ఇచ్చిన 136 ఎకరాల భూమిలో రూపుదిద్దుకున్న ఈ ఎడ్యుసిటీ ద్వారా రాష్ట్ర యువతకు మరియు విమానయాన రంగానికి అపారమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. పైలట్లు, ఏరోనాటికల్ ఇంజనీర్లు, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ నిపుణులు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లతో పాటు డిఫెన్స్ టెక్నాలజీ విభాగాల్లో ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వనున్నారు.

భారతదేశంలో 2030 నాటికి వాణిజ్య విమానాల సంఖ్య 1,700 కి పెరగడమే కాకుండా ప్రయాణికుల సంఖ్య 70 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ భారీ డిమాండ్‌కు తగ్గట్టుగా నేరుగా గ్లోబల్ మార్కెట్‌లో ఉద్యోగాలు పొందేలా జాబ్-రెడీ ప్రొఫెషనల్స్‌ను ఈ ఎడ్యుసిటీ ఉత్పత్తి చేయనుంది.

ఇక ఈ వ్యూహాత్మక ఆలోచన కేవలం విద్యారంగానికే పరిమితం కాకుండా ఏపీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్యాన్ని చేరుకోవడంలో అత్యంత కీలకంగా మారనుంది. ఎయిర్‌పోర్టుకు తోడుగా ఈ ఏవియేషన్ అకాడమీ ఉండటం వల్ల ప్రపంచ స్థాయి డిఫెన్స్, ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీలు భోగాపురం చుట్టుపక్కల భారీ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.

ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు 99 పైసలకే భూకేటాయింపులు చేసే విధానంతో ఇప్పటికే TCS, కాగ్నిజెంట్ వంటి దిగ్గజాలు రాగా, ఏరోస్పేస్ రంగంలోనూ మరిన్ని దిగ్గజ కంపెనీలు రానున్నాయి.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విమానాల రాకపోకలకు ద్వారాలు తెరుస్తుంటే..నారా లోకేష్ విజన్‌తో రూపుదిద్దుకున్న GMR-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ యువత గ్లోబల్ క్యారియర్‌లో అత్యున్నత శిఖరాలకు ఎగిరేందుకు రెక్కలు తొడుగుతోందని చెప్పడంలో సందేహం లేదు.

Related posts

అమిత్ షా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే బహిష్కరిస్తారా?

Satyam News

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

Satyam News

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News

అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ కేసు

Satyam News

Leave a Comment