ప్రకాశంహోమ్

సత్వర విచారణతో నేరాలకు చెక్ పెట్టవచ్చు

#KandukuruPoliceStation

సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు కందుకూరు సబ్ – డివిజన్లోని వలేటివారిపాలెం, లింగసముద్రం, కందుకూరు టౌన్, కందుకూరు రూరల్, గుడ్లూరు పోలీస్ స్టేషన్‌ లను, గుడ్లూరు సర్కిల్ కార్యాలయం, కందుకూరు సబ్ డివిజన్ కార్యాలయమును సందర్శించారు. స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణం, వివిధ గదులు, మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్ కౌంటర్‌తో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైల్స్ సహా పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, నేర నివారణకు చేపడుతున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు

అలాగే పోలీస్ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితిగతులను పరిశీలించి, వాటి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి ఫిర్యాదుదారులకు  త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. ప్రతి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీ.డి. ఫైల్‌లో సక్రమంగా నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియ సజావుగా సాగేలా, దర్యాప్తు నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొత్త చట్టాలప్రకారం రిజిస్టర్ లను కూడా కొత్త ప్రోపార్మా ప్రకారం జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించకుండా, వాటిపై విచారణ వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. శక్తి టీములు, మహిళా పోలీస్‌లు, డ్వాక్రా మహిళలు సమన్వయంతో మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు, రక్షణ చట్టాలు, శక్తి యాప్ గురించి వివరించాలని, శక్తి టీమ్ సభ్యులు, గ్రామ పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

మహిళలు పిల్లల భద్రత మన తక్షణ కర్తవ్యం

మహిళాలు, పిల్లలు భద్రతాకు శక్తి టీములు సమర్ధవంతంగా విధులు నిర్వహించే విధంగా మరియు సైబర్ నేరాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపడుతూ నిరంతరం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను బ్లాక్ స్పార్ట్స్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్స్, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్ములు ఏర్పాటుచేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి.

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వాహనాలు నడిపిటప్పుడు తనపై ఒక కుటుంబం ఆధారపడి ఉండుందని గుర్తుచేస్తుకోవాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం తగి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతపై అవగాహనా పెంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రకారం వాహనాలు నడపటంతోపాటు ప్రజలలో మార్పు వచ్చినపుడు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.

బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు

ఎన్ఫోర్స్మెంట్ ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అవసరమైన తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. అలాగే ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బహిరంగ మద్యపానాన్ని నియంత్రించడం ద్వారా నేరాల శాతం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు కందుకూరు టౌన్ పరిధిలో 16 బహిరంగ ప్రదేశాలను పోలీసు, స్ధానిక ప్రజలు శుభ్రం చేసినట్లు తెలిపారు. కేసుల దర్యాప్తులో సిబ్బందిని కూడా భాగస్వాములను చేసి వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పాత నేరస్థులు, అనుమానితులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి జీవన విధానం తదితర విషయాలను తెలుసుకోవాలని, వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక/చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట కందుకూరు డిఎస్పీ CH.బాలసుబ్రమణ్యం, గుడ్లూరు సీఐ జి.మంగారావు, కందుకూరు సీఐ SK.అన్వర్ బాషా, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, సబ్ డివిజన్ ఎస్సై లు మరిది నాయుడు, శివ నాగరాజు, బాలకృష్ణ మరియు జి.మంగారావు మరియు సిబ్బంది ఉన్నారు.

Related posts

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

శాశ్వత రాజధానిగా అమరావతి: అసెంబ్లీ తీర్మానం

Satyam News

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

జగన్ గో బ్యాక్: దళితుల ఆందోళన తీవ్రరూపం

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

Leave a Comment