కర్నూలుహోమ్

మహా శివరాత్రి నుంచి శ్రీశైలం లో ఉచిత లడ్డూలు

#SrisailamTemple

శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల కోసం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా లడ్డూ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు, రద్దీ అత్యధికంగా ఉండే ఫిబ్రవరి 14 మరియు 15 తేదీల్లో వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ టోల్ ఫీజును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా పాలు, బిస్కెట్లు, మంచినీరు మరియు అల్పాహారం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సుమారు 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, భద్రత మరియు పార్కింగ్ విషయంలో కూడా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

Related posts

మానవత్వం చాటుకున్న ఆలూరు ఎమ్మెల్యే

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

Satyam News

అబద్ధం సుబ్బారెడ్డిది…. సాక్ష్యం ఫోటోలది

Satyam News

Leave a Comment