26.7 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదు

#Chandra

పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్నవారిపై ఇటీవల జరిపిన పున:పరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు.

ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్టు, అన్నివిధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి… ఎలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది పెన్షన్ పొందుతున్నట్టు పరిశీలనలో తేలిందని తెలిపారు. అనర్హులైన పెన్లన్లు ధృవీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి నిర్ధారించినట్టు వెల్లడించారు. అయితే నకిలీ పెన్షన్లను మాత్రమే తొలిగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛనుదారుకు పెన్షన్ రద్దు కాకూడదని సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అర్హులైన పెన్షన్లు యధావిధిగా కొనసాగుతాయని, దివ్యాంగులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని సీఎం చెప్పారు.

Related posts

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

Satyam News

జగన్‌ మత ఉగ్రవాది…..  బాంబు పేల్చిన విజయసాయి!

Satyam News

ఏపీలో UAE ఫుడ్ క్లస్టర్…. రైతన్నలకు గ్లోబల్ మార్కెట్.!

Satyam News

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త

Satyam News

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News

క్షేత్ర స్థాయిలో బలం… పోరాడే గుణం… సువేందు

Satyam News

Leave a Comment