రత్నాచల్ తగలెట్టడం నుండి ఏ కొత్త స్కెచ్ అయినా.. వైఎస్ రాజారెడ్డి ముఠా మనిషిని పెట్టిన తిరుపతి నుండి, ఆయనతో మొదలెట్టడం సంధింటి ఆనవాయితీ!
కడప జిల్లా నుండి పేరుకు టెలిఫోన్ బూతును నడిపేలా భూమన కుటుంబాన్ని తిరుపతిలో పెట్టింది వైఎస్ రాజారెడ్డే అని ఆ కుటుంబాన్ని నాలుగు దశాబ్దాలకు పైగా గమనించే వారికున్న అవగాహన.
బూతులు, నాస్తిక వాదం, నక్సలిజం, రాడికల్స్, విరసం, బూతు సాహితీప్రియులు, రాయలసీమ పోరాట యోధులు, తెలుగు మహా సభల్లో హిందూ పురాణ పాత్రధారులు, సనాతన ధర్మ పరిరక్షకులు, తిరుమల పాలకమండలి అధ్యక్షులు, తుడా, తిరుపతి ఎమ్మెల్యే.. పవిత్ర శ్వేతాకు డైరెక్టరు & టిటిడి బోర్డు కో-ఆఫ్షన్ మెంబరు, పాత్రలు సినిమా నటులు కూడా వెయ్యలేనన్ని పాత్రలు ధరించింది భూమన బ్రదర్స్.
తిరుపతిలో రాజారెడ్డి యువసేన స్థాపించి చెవిరెడ్డిని ప్రెసిడెంటుగా చెయ్యడం, దేశంలో విరసం అనే సంస్థను స్థాపించింది, సుప్రభాతాన్ని బూతుగా మార్చి రచించిన రచయిత, తిరుపతి నక్సల్స్ అనుబంధ రాడికల్ విద్య్హార్థి సంఘ స్థాపకుడు & అధ్యక్షుడు, బూతు సాహిత్య రచనలు, ప్రసంగాలతో తిరుపతి పోలీస్ ఎఎస్‌పి రామచంద్రా రెడ్డితో గొడవ, ఎస్‌యూవి నుండి బహిష్కరణ, అన్నకు తోడుగా కరుణాకర్ రెడ్డి, విరసానికి నక్సలైట్లకు మధ్య కొరియర్,
రాజ రెడ్డి జైలు జీవితం నుండి ఆయనకు శిష్యరికం, బంధురికం (జగన్ కజిన్ కు వీరి అమ్మాయిని ఇచ్చారు) కూడా.
భూమన సోదరి భర్త జంగా ప్రతాప్‌రెడ్డి ఎస్వియు రిజిస్ట్రార్, టిటిడి నిధులతో నడిచే కాలేజీలో లెక్చరర్ భూమన సుబ్రమణ్యం రెడ్డి, తరువాత పవిత్ర శ్వేతాకు డైరెక్టరు & టీటీడీ కో-ఆఫ్షన్ మెంబరు. ఆయన పెళ్లాం కుసుమకుమారిని ఎస్కేయూ ఉపకులపతి. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకుకు తిరుపతి డెప్యూటీ మేయర్, ఎమ్మెల్యే టికెట్.
రోజూ కొండ మీద పడే భూమన కరుణాకర్ రెడ్డి
పిడుగులా జగన్ మాజీ జైల్మేట్ శ్రీలక్ష్మి మీద విరుచుకు పడ్డాడు.
50 లక్షలకు మించిన పదకొండు విగ్గుల గురించి, రోజూ కట్టే చీర ఖరీదు.. లక్ష నుంచి లక్షన్నర.. ఆధునిక రజియా సుల్తానా.. తాటకి, పోతన, లంకిణి.. ఆమె ఉద్యోగం ఏంది? ఇవన్నీ ఏంది అని భూమన మాట్లాడేసరికి మీడియా కొయ్యబారిపోయింది.
ఒక గోల్డ్‌మెడల్ ఐఏఎస్ అధికారిణి ఆవిడ. సీనియర్ అధికారిణిగా డెప్యూటేషన్ మీద తెలంగాణా నుండి రప్పించారు. ఆవిడ మీద ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ.. చనిపోయిన నెల్లూరు నేత ఆనం సాక్ష్యం చెప్పలేడని ఆయన్ని కూడా లాగుతూ ఐఏఎస్ బ్రతుకు గురించి ప్రశ్నిస్తున్న భూమన బ్రదర్స్ ఎక్కడి నుండి వచ్చి తిరుపతిని, తిరుమల కొండను ఎలా దోచుకొని వేల కోట్లు సంపాయించారో ప్రక్కన బెడితే.. ఏదో భారీ కుట్రకు తెరతీసినట్లున్నాడు జగన్. లేదంటే తిరుపతి నుండి భూమనతో ఇలా మొదలెట్టించడు.
కానీ భూమన కుటుంబ కూసాలు కదిలేలా స్కాములు భయపడుతున్నాయి. నిన్ను నువ్వు రక్షించుకో అని జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడా? అందుకోసం ఆయన విగ్గులు సవరాల కథలు మొదలెట్టాడా? మరీ 11 విగ్గులతో మొదలెట్టాడు అంటే వైకాపా ఎమ్మెల్యేల సంఖ్యను గుర్తు చేస్తూ ఎద్దేవా చేస్తున్నాడా?
ఈయన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడిన సంచలన విషయాలను సాక్షి మీడియాలో, వైకాపా సోషల్మీడియాలో రాలేదు. నిన్నటి వరకు ఆయన అబద్దాలను అచ్చేశారు కదా? ఈరోజు ఏమయ్యింది?
భూమన కొట్టేసిన సొమ్ములు, తాడేపల్లి బేబెక్కకు లెక్కలు చెప్పి వాటా ఇవ్వలేదా? మంత్రులనే లెక్క చెయ్యలేదు, పెద్ద ఎత్తున అవినీతి చేసింది అని నేరుగా జగన్ పాలన అవినీతిమయ పాలన అని పరోక్షంగా గాలి పీకుతూ.. తాడేపల్లి లంఖిణి అని, వైకాపాకు పూతన అని, 11 విగ్గులతో అని పార్టీనే గాలితీస్తూ.. బ్లాక్‌మైల్ చేస్తున్నాడా?
దొంగల ముఠాలో ముసలం మొదలయ్యిందా?
నామాలయ్యకే నామాలు పెట్టాను అని అహంకరిస్తున్న భూమనకు దేవుడు ఏమి వ్రాసిపెట్టాడో. దేవుడి లీలలు అర్థం కావు. అందులోనూ నామాలయ్య!