సినిమాహోమ్

తెలుగు ఇండస్ట్రీకి మరో యువ హీరో దొరికాడు

#DilRaju

అమెరికాలో స్థిరపడిన తెలుగువారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్ లోనూ NRI యూత్ దుమ్మురేపుతున్నారు. న్యూయార్క్ లో స్థిరపడిన ప్రముఖ ఫార్మసిస్ట్ లక్ష్మణ్ అనుగు పెద్ద కుమారుడు అమిత్ ఓ వైపు డాక్టర్ కోర్సు చదువుతూనే మరోవైపు యాక్టింగ్ లోనూ రాణిస్తున్నాడు.

తాజాగా అమిత్, దివి నటించిన ఇండిపెండెంట్ సోలో సాంగ్ అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇద్దరు సోలో ట్రావెలర్స్ అనుకోని పరిచయం, ప్రేమగా ఎలా మారిందనే కాన్సెప్ట్ ను అందమైన లొకేషన్లలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నార్త్ కరోలినా, ఛార్లెట్ లో నిర్వహిస్తున్నమెగా కన్వెన్షన్ వేదికపై ఈ పాటను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ ఎన్.ఆర్.ఐ, వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, తదితరులు ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అక్కడ బిగ్ స్క్రీన్ పై సాంగ్ ను ప్రజెంట్ చేయగా ఆహుతుల నుంచి మంచి స్పందన వచ్చింది. అమిత్ లో మంచి ఈజ్ ఉందని, నటనలో ప్రోత్సహిస్తే మరింతగా రాణిస్తాడని, టాలీవుడ్ కు మరొక కొత్త హీరో దొరికినట్లేనని దిల్ రాజు ప్రశంసించారు. టాలెంట్, హార్డ్ వర్క్ ఉన్నవాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఆదరిస్తుందని ఆయన అన్నారు. మధుర ఆడియో ద్వారా ఇప్పటికే విడుదలైన ప్రోమోలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్ సాంగ్ యూట్యూబ్ వేదికగా వెంటనే అందుబాటులోకి వచ్చింది.

నటి దివి కూడా ప్రత్యేకంగా అమెరికా వెళ్లి ఈ వేడుకలో పాల్గొన్నారు. అమిత్ తో తన స్క్రీన్ ప్రజెన్స్ బాగా కుదిరిందని, సాంగ్ రిలీజ్ ను ఆదరించి, సక్సెస్ చేసిన ప్రవాస తెలుగువారందరికీ ఈ వేదిక ద్వారా దివి కృతజ్జతలు తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఈ సోలో సాంగ్ కు కాన్సెప్ట్, కొరియోగ్రఫీ, డైరెక్షన్ చేయగా, లక్ష్మణ్ అనుగు నిర్మించారు. ఈయూత్ ఫుల్ సాంగ్ ను సురేష్ బనిసెట్టి రచించగా, అరుణ్ చిలివేరు సంగీత దర్శకత్వంలో సింగర్ దీపు పాడారు. గోవాతో పాటు వికారాబాద్ వివిధ లోకేషన్లలో ఈ పాటను షూట్ చేశారు.

Related posts

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News

శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైపు లైన్ పనుల పూర్తికి చర్యలు

Satyam News

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

Satyam News

సినీ జంట కు డీఎన్ఏ పరీక్ష

Satyam News

ఇందాపూర్‌.. వైసీపీ….. ఓ కల్తీ కథ…!!

Satyam News

ఒక సంకల్పం… ఒక సేవా యజ్ఞం… ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌

Satyam News

Leave a Comment