26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న దురంధర్ 2

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) పేరుతో వస్తున్న ఈ సినిమాను 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై భారీ విజయాన్ని అందుకోగా, ఈసారి సీక్వెల్‌ను తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ సీక్వెల్‌లో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా మరియు అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు రణ్‌వీర్ సింగ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A 16+ సర్టిఫికేట్‌ను పొందింది. సుమారు 3 గంటల 28 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇతర భారీ చిత్రాలతో పోటీ పడనుంది. పవర్‌ఫుల్ యాక్షన్ మరియు ఇంటెన్స్ డ్రామాతో రూపొందిన ఈ మూవీ మార్చిలో థియేటర్లలో సందడి చేయనుంది.

Related posts

ఆపరేషన్ సిందూర్ కు ఏడాది పూర్తి

Satyam News

శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గం ప్రారంభం

Satyam News

బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం

Satyam News

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

Satyam News

జగన్ రెడ్డికి సంక్రాంతి సందేశం

Satyam News

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News

Leave a Comment