26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

#MalluRavi

తెలంగాణలో ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని, తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, అందుకే దాదాపు 75 నుండి 80 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగిరిందని మల్లు రవి తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే నిలబడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడం, 2025లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు మరియు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడం ప్రజల మద్దతుకు నిదర్శనమని వివరించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో 66 శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలను వదిలేసి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే ఆ పార్టీల పతనానికి కారణమని మల్లు రవి విశ్లేషించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఆయన కొనియాడారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను కాంగ్రెస్ గౌరవిస్తుందని, అయితే ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనవసర విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని మల్లు రవి విజ్ఞప్తి చేశారు.

Related posts

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News

శ్రీశైలంపై రాజకీయ రగడ మొదలెట్టిన వైసీపీ

Satyam News

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం

Satyam News

Leave a Comment