ప్రత్యేకంహోమ్

రికార్డు స్థాయి వృద్ధిరేటు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

#APAssembly

రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది.

దైవానుగ్రహంతో రాష్ట్రానికి అభివృద్ధి కలగాలని, కొత్త ఆర్థిక సంవత్సరం సాఫల్యంగా సాగాలని మంత్రి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం 11.75 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా రెండంకెల వృద్ధి సాధిస్తామని అంచనా వేస్తున్నామని చెప్పారు.

10.75 శాతం వృద్ధి రేటు సాధించాం

ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం 2025-26లో 10.75 శాతం వృద్ధి నమోదు అవుతుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. దేశ స్థాయిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ వేదికపై శక్తివంతమైన దేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో దేశ ప్రయోజనాలను కాపాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అన్నారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించారు.

ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ.27,719 కోట్లు, దీపం 2.0కు రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతుగా రూ.2,320 కోట్లు, స్త్రీశక్తి కార్యక్రమానికి రూ.1,420 కోట్లు కేటాయించారు. వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ కోసం రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో రూ.450 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు కేటాయించారు.

సమగ్ర శిక్షకు రూ.2,946 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.2,161 కోట్లు, మన బడి–మన భవిష్యత్‌కు రూ.1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి రూ.1,232 కోట్లు కేటాయించారు. పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి రూ.654 కోట్లు, యువత మరియు క్రీడల అభివృద్ధికి రూ.438 కోట్లు కేటాయించారు.

వ్యవసాయం మరియు నీటి భద్రతకు కూడా ప్రాధాన్యతనిస్తూ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.9,906 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో రూ.260 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజనకు రూ.190 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న 212 గుండెలు

Satyam News

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

Satyam News

హిందూ దేవాలయాలకు టిటిడి రాయితీలు

Satyam News

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

Leave a Comment