తూర్పుగోదావరిహోమ్

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

#BotsaSatyanarayana

కొన్ని విషయాల్లో రాజకీయాలు చేయడం వల్ల లాభం లేకపోగా.. నష్టం జరుగుతుంది. విజయవాడ రౌడీ షీటర్‌ సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. సాయికృష్ణ కేసుని.. కులం పేరుతో ముడిపెట్టి.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఫెయిల్‌ అయ్యాయి.

సీఎం చంద్రబాబు సాయికృష్ణ తల్లితో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. నేరుగా చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత.. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందని.. ఈ విషయంలో రాజకీయాలు వద్దని సాయికృష్ణ తల్లి చెప్పడంతో.. వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయింది.

అయినా జగన్‌ అండ్‌ కో ఆ అంశాన్ని వదిలిపెట్టలేదు. కోనసీమలో వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. సాయికృష్ణ కుటుంబాన్ని ఆదుకొందామని ప్రతిపాదించారు. సమావేశానికి వచ్చిన కాపు నాయకులంతా తలోయాభై వేలు వేసుకొని.. సాయికృష్ణ కుటుంబానికి ఆర్ధిక సాయం చేద్దామని బొత్స ప్రతిపాదించారు. కానీ మిగిలిన వాళ్లు.. బొత్స ఐడియాని వ్యతిరేకించారు. దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ అధినేత జగన్‌రెడ్డి.. సాయికృష్ణ తల్లిని కలిసిన సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కానీ.. ఆర్ధిక సాయం చేస్తానని చెప్పలేదు. ఇప్పుడు కాపు నేతలు సాయికృష్ణ కుటుంబానికి ఆర్ధిక సాయం చేస్తే అది జగన్‌కి అవమానకరంగా మారుతుంది. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన బాధితులు.. తమకూ సాయం చేయాలని డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ఒకరికి సాయం చేస్తే.. అందరికీ చేయాల్సి వస్తుంది.. ఆ ఒక్కరికీ డబ్బులు ఇవ్వకపోతే.. ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

బొత్స చెప్పినట్లు తలో యాభై వేలు వేసుకొని సాయికృష్ణ కుటుంబానికి ఇస్తే అది జగన్‌ని అవమానించినట్లే అవుతుంది. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా లక్ష రూపాయల సాయం చేస్తాను అనలేదని జగన్‌కి చెడ్డ పేరు రాకుండా.. భవిష్యత్తులో శవ రాజకీయాలు చేసిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. బొత్స ప్లాన్‌కి బ్రేకులు వేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితులకు కోటి రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్‌.. ఇంతవకు ఇవ్వలేదనే విషయాన్ని అక్కడి ప్రజలు గుర్తు చేసుకొంటున్నారు. మొత్తానికి బొత్స ప్లాన్‌ ముందుకు వెళ్లకపోయినా.. ఆయన మాటలతో జగన్‌కి జరగాల్సిన అవమానం జరిగిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.

Related posts

ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువ: జాగ్రత్త

Satyam News

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News

ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి?

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

డీప్‌ఫేక్ కలకలం: మహిళ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు!

Satyam News

పాకిస్తాన్ పరువు తీసిన జై శంకర్

Satyam News

Leave a Comment