ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రతులపై దైవానుగ్రహం ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఈ బడ్జెట్ ద్వారా మేలు జరగాలని కోరుకుంటూ మంత్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శులు వినయ్ చంద్, రోనాల్డ్ రోస్, ఆర్ధిక శాఖ జాయింట్ సెక్రెటరీ గౌతమ్ అల్లాడ, ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రెటరీ సూరజ్ గనోర్, తదితర అధికారులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Related posts

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News

హోర్మోజ్ లో బాంబులు ఎక్కడ పెట్టారో మరచిపోయిన ఇరాన్

Satyam News

మమతా బెనర్జీని దెబ్బతీసిన అహంకారం

Satyam News

హోలీ వేడుకలలో విషాదం: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

Satyam News

పోలవరం పనుల నాణ్యతపై నిపుణుల సంతృప్తి

Satyam News

మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం

Satyam News

Leave a Comment