26.3 C
Hyderabad
September 19, 2026
జాతీయంహోమ్

నాగపూర్ లో పేలుడు: 15 మంది మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ పేలుడు సంభవించి పెను విషాదాన్ని నింపింది. నాగ్‌పూర్‌లోని ఎస్.బి.ఎల్ (SBL) ఎనర్జీకి చెందిన బి-20 ప్లాంట్‌లో జరిగిన ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 15 మంది మరణించగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న బి-16 ప్లాంట్ కూడా దెబ్బతినడమే కాకుండా, అక్కడి కాంక్రీట్ కట్టడాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, డెటొనేటర్‌కు వైరును కలుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలు శిథిలాలను తొలగించే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి వచ్చిన శబ్దం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించిందని ఎస్పీ హర్ష పొద్దార్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Related posts

పులివెందుల దెబ్బ.. ఏపీలో జగన్‌ మిస్సింగ్…!!

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

Satyam News

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News

వీధి కుక్కల స్వైర విహారం:9 మందిపై దాడి

Satyam News

Leave a Comment