26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

#CongressParty

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్ధులు నేడు తమ నామినేషన్ లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్ రెడ్డి లను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిద్దరూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి  హాజరయ్యారు.

ఆయనతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ మూడు సెట్ ల నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

రాజ్యసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు. వీరి నామినేషన్ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా అభ్యర్థులకు విజయావకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు.

నామినేషన్ కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ ముందున్న ఎన్నికల ప్రక్రియపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం జరిగింది.

Related posts

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

శ్రీనగర్ – లడఖ్ మధ్య రవాణా కష్టాలకు చెక్

Satyam News

దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకి బిగిస్తున్న ఉచ్చు…..!!

Satyam News

ఒంగోలులో ‘స్నేహ’ సేవా కార్యక్రమం

Satyam News

ఈడీ దెబ్బతో మళ్లీ జగన్ గుండెల్లో భయం

Satyam News

ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన

Satyam News

Leave a Comment