26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

బాపట్ల జిల్లాలో వైభవంగా శ్రీరాముని కళ్యాణం

#Bapatla

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల జిల్లాలో పలుచోట్ల శ్రీశ్రీశ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు చలువ పందిళ్ళ మధ్య వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మేళ తాళాలతో భక్తుల మధ్య  ప్రారంభించిన వేద పండితులు,  ఈ మహోత్సవానికి  శ్రీరాముని ఆలయాలు ముస్తాబయ్యాయి.

ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ సత్యానికి ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు,   మనిషిల ఎలా జీవించాలో చూపించిన ఆదర్శం శ్రీరామునికే దక్కిందని అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని సకలజనులు ఏలా జీవించాలని ఆయన చూపిన మార్గంలో  అలాగే  ప్రజలు వెళ్లాలని  కోరారు.అలాగే హైందవ ధర్మాన్ని కాపాడాలని మనమంతా సుభిక్షంగా ఉండాలని పూజలు చేసి స్వామివారి కటాక్షం మనందరి పై ఉండాలని ఆశీర్వదించారు,

అనంతరం భక్తులకు, శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పుణ్య దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు, పానకం, వడపప్పు పంచారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు జరిగాయి. బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ రాజు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ లు వివిధ శాఖల జిల్లా అధికారులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

స్థానిక బాపట్ల భావనారాయణ స్వామి గుడి దగ్గర ఏం చేసిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా శ్రీ సంపత్ గణపతి పరివార్ మహర్షి ఆశ్రమ గోశాల సంయుక్తంగా పన్నాల రఘురామ శర్మ భారతి దంపతుల  సహకారంతో  అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి శాస్త్రి  బాబు నాగేంద్ర లక్ష్మీ ప్రభావతి  వల్లూరి భావనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

వచ్చే నెలలో భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు

Satyam News

అసెంబ్లీ కి వెళ్లనున్న సినీ హీరోయిన్ త్రిష?

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

Leave a Comment