గుంటూరు హోమ్

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

#Urea

రాష్ట్రంలో యూరియా కొరత పేరిట రాద్ధాంతం చేస్తున్న వైకాపా గుట్టు మరోసారి రట్టు అయింది. అసత్య ప్రచారంలో అడ్డంగా దొరికిపోయిన వినుకొండ నియోజకవర్గం ఈపూరు వైకాపా నేతలు రైతులందరి ముందు అభాసుపాలయ్యారు. కావాలనే ప్లాన్‌ చేసిన ధర్నా ప్రచారం బెడిసి కొట్డడం తో రైతులతోనూ చీవాట్లు తిన్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారం ఈపూరు పీఏసీఎస్ ముందు కొందరు రైతులు యూరియా కోసం నిల్చుని ఉన్నారు. వారి వంతు కోసం వేచి చూస్తున్న సమయంలో నుంచోవడం ఎందుకు కూర్చోమంటూ సలహా ఇచ్చిన ఒక వైకాపా మనిషి ఆ ఫో టోలు తీసి స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో యూరియా కోసం రైతుల ధర్నా అంటూ తప్పుడు ప్రచారం చేశారు.

విషయం తెలుసుకున్న ఈపూరు పీఏసీఎస్‌ ఛైర్మన్ హనుమయ్య రైతులతో మాట్లాడితే అసలు వెలుగు చూసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన లేని యూరి యా కొరత పేరిట వైకాపా వాళ్లు ఇలా దుర్మార్గపు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు.

సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఒక్కొక్కరిగా యూరియా బస్తాలు తీసుకుంటున్న సమయంలో వైసీపీ యువ నాయకులు వారిని కూర్చోబెట్టి ధర్నా చేస్తున్నట్లు ఫోటోలు తీసి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సొసైటీలో రోజు మార్చి రోజు యూరియా కట్టలు రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నామని, ఎవరికీ అందకుండా లేవన్నారు .ఇంకా సొసైటీ 880 బస్తాల నిల్వ ఉందన్నారు. అయినా ఇలా తప్పుడు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి శునకానందం పొందడం సిగ్గుచేటన్నారు

Related posts

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News

సృష్టి కేసు: చీ ఛీ వీర్యం కుంభకోణం లో కూడా….

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

Leave a Comment

error: Content is protected !!