విశాఖపట్నంహోమ్

మర్రిపాలెం ఉడా లేఔట్లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు

#Marripalem

విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లేఔట్ రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వినియోగదారుల జిల్లా  కమిషన్2 ప్రెసిడెంట్ జీ వెంకటేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళ పాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగిందని, మహిళలు అన్నింటి ముందడుగు వేస్తున్నారని, కుటుంబంలో వెలుగులు నింపడమే కాకుండా సమాజాభివృద్ధికి కూడా మహిళ కృషి చేయడం అభినందనీయమన్నారు.

#womensday

ప్రస్తుత తరుణంలో అన్ని రంగాల్లో మహిళ తన ప్రతిభ చాటుకుంటుందని అలానే అన్ని విధాలుగా తమ కుటుంబ బాధ్యతలను అభివృద్ధి పరచేందుకు కూడా కృషి చేస్తున్న మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. సృష్టికి మూల రూపమైన మహిళను ప్రతి ఒక్కరూ గౌరవించక తప్పదన్నారు.

కుటుంబ వ్యవస్థ బలోపేతానికి ముఖ్య ఆధార స్తంభాలుగా నిలవడమే కాకుండా సమాజాభివృద్ధికి సైతం మహిళలు కృషి చేస్తున్నారన్నారు.

మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందన్నారు. మహిళలు తెలివితేటలతో నాయకత్వ లక్షణాలతో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారని తమ దైర్యం పట్టుదలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని మహిళలు మన సమాజానికి ఎంతో ఖ్యాతి తెస్తున్నారని అటువంటివారిని సమాజంలో గౌరవించక తప్పదన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం విశాఖపట్నం జిల్లా డిప్యూటీ కలెక్టర్ జె మాధవి, వెస్ట్ ఎమ్మెల్యే సతీమణి పి మాధవి సమాజంలో మహిళల పాత్ర పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సుధా మాధురి, అరుణ శ్రీ, సౌజన్య, వసంత లక్ష్మి, వెంకటలక్ష్మి, ఝాన్సీ లక్ష్మి, భాను,వాణి, సీత. వరలక్ష్మి, శలోమి, దీప్తి, లక్ష్మి కాంతo పాల్గొన్నారు.

Related posts

శుక్ర మౌఢ్యమితో ముహూర్తాలకు బ్రేక్

Satyam News

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులుల సందడి

Satyam News

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

Satyam News

చైనాకు లొంగిపోయిన మోడీ: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

క్వాంటం కంప్యూటింగ్ లో కీలక ఘట్టం ఆవిష్కరించిన అమరావతి

Satyam News

Leave a Comment