25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

కక్షలు లేవు, కార్పణ్యాలు అంతకన్నా లేవు.., దాడులు.., దౌర్జన్యాలు.., దందాలను ప్రోత్సహించేదే లేదు.. మా వేట.., ఆట.. అభివృద్ధి వైపే బాటలు వేస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు. ఆదివారం స్ధానిక పార్క్ సెంటర్ నందు జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని భారీ ఏర్పాట్లతో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి, ఎన్టీఆర్ సేవలను స్మరించుకుని నినాదాలు చేశారు. అనంతరం వేదికపై పార్టీ సీనియర్ నాయకులు, యాక్టీవ్ గా ఉండే కార్యకర్తలను, కేసుల్లో ఇబ్బంది పడిన కేడర్ ను ఘనంగా సన్మానించారు. వేలాదిగా తరలివచ్చిన శ్రేణుల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్ధాపించి, దేశ రాజకీయాల్లో రికార్డులు తిరగరాసేలా 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ కే దక్కుతోందన్నారు. అనేక సంస్కరణలతో ఉమ్మడి ఏపీకి సుపరిపాలన అందించి, అసాధారణమైన శక్తిగా ఎన్టీఆర్ ఎదిగారని గుర్తు చేశారు.

21 నెలల కూటమి ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కృషితో మాచర్ల నియోజకవర్గ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని చూస్తున్నారని చెప్పారు. వరికపూడిశెల, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు త్వరలో సాగు, తాగు నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయని వివరించారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నేతృత్వంలో విద్యా, వైద్యం, రైతాంగ రంగాలకు ఇది సువర్ణయుగమని హర్షం వ్యక్తం చేశారు.

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్యే జూలకంటి ధ్వజమెత్తారు. సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే.., ఖబడ్దార్ పిన్నెల్లి తాటతీస్తామని హెచ్చరించారు. రెండు దశాబ్ధాలుగా మాచర్లను పట్టిపీడించి, అక్రమాస్తులు కూడబెట్టారని విమర్శించారు.

పిన్నెల్లి రక్కసి మూకల అంతం తరువాత నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలు, వ్యాపారులను పీడించే సంస్కృతికి చరమగీతం పాడామన్నారు. పిన్నెల్లి ముఠా ఒళ్లుదెగ్గరపెట్టుకుని మాట్లాడుకుంటే, తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కన్నెర్ర చేస్తే పక్క రాష్ట్రాలకు పారిపోయే పిరికి పందలు పిన్నెల్లి సోదర్లు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని, జాగ్రత్తగా నడుచుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్ధాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

Satyam News

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

Satyam News

జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి

Satyam News

‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

Leave a Comment