ముఖ్యంశాలు హోమ్

పులివెందుల వార్ 2: ఓటుకి వేల నోట్లు….!!

#YSJagan

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై  వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిలో భయం మొదలయిందనే చర్చ సాగుతోంది.. పులివెందుల అంటే జగన్‌ గడ్డ.. వైసీపీ అడ్డా… అక్కడ పసుపు జెండా ఎగిరితే, జగన్‌ నైతికంగా, మానసికంగా దెబ్బతినడం ఖాయం.. ఆయనపై టీడీపీ మైండ్‌ గేమ్‌ మొదలు పెడుతుంది.. ఇటు, సొంత నియోజకవర్గంలో జగన్‌ ఓటమి చెందడం అంటే, వైసీపీకి అది మింగుడు పడని వ్యవహారం… ఇది జగన్‌ని కోలుకోనీయకుండా చేయగలదు..

జగన్‌ చేయించిన సొంత సర్వేలో పులివెందుల జడ్పీటీసీ స్థానంలో సైకిల్‌ దూసుకుపోవడం ఖాయం అనే రిపోర్టులు అందాయని వైసీపీలో చర్చ సాగుతోంది… దీంతో, ఓటుకి 12 వేల నుండి 15 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారని ప్రచారం జరుగుతోంది… గత రెండు రోజులుగా పులివెందులలో నోట్ల కట్టలు రెపరెపలాడుతున్నాయనే లీకులు వైరల్‌ అవుతున్నాయి.. ఇదంతా లిక్కర్‌ మనీ అని, ఇడుపుల పాయ డంప్‌ నుండి వస్తోన్న కట్టలు అని గుసగుసలు వినిపిస్తున్నాయి..

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు గెలవడం జగన్‌కి అత్యంత ప్రతిష్టాత్మకం.. గత సాధారణ ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.. ప్రతిపక్ష హోదా కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీలో అడుగు పెడతానని, లేదంటే గేటు కూడా తాకనని జగన్‌ తెగేసి చెబుతున్నాడు.. ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి శాసన సభా సమావేశాలను జగన్‌ బహిష్కరించడం వెనక అసలు మేటర్‌ ఏంటనేది అందరికీ తెలుసు.. కేవలం ఎమ్‌ఎల్‌ఏ హోదాతో తాను సభకు హాజరు కాలేడు. ఆయనకు మాట్లాడడానికి తగిన సమయం దక్కదు నియమ నిబంధనల రీత్యా.. ఇది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు… అందుకే, డుమ్మా కొడుతున్నాడనేది యదార్ధ సత్యం..

ఇంతగా మోరల్‌గా దెబ్బతిన్న జగన్‌కి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఓడిపోతే, అది ఆయనను మరింత డ్యామేజ్‌ చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎలాగయినా తన సొంత గోదాలో జరుగుతున్న యుద్ధంలో వైసీపీ గెలిచి తీరాలి.. ఇప్పటికే ఆ బాధ్యతను తన సోదరుడు అవినాష్‌ రెడ్డి, ఎమ్‌ఎల్‌సీ సతీష్ రెడ్డికి అప్పగించాడు జగన్‌.. ఆ ఇద్దరు తమ శక్తి మేర కృషి చేస్తున్నా, లోకల్‌గా పాజిటివ్‌ సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తోంది.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి.. వారి మైండ్‌ సెట్‌ మార్చేస్తున్నాయి.. ఇదే, జగన్‌ని భయపెడుతోంది..

మరోవైపు, వైఎస్‌ వివేకా హత్య కేసులో అవినాష్‌ రెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి.. ఇటు, జగన్‌ సైతం వాటిపై సరిగా క్లారిటీ ఇవ్వలేదు.. ఈ ప్రభావం కూడా లోకల్‌గా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక నేతలు చెబుతున్న మాట.. ఈ పరిణామాలతో పులివెందుల పూల అంగళ్ల సాక్షిగా ఈ దఫా పసుపు జెండా ఎగరడం ఖాయమని జగన్‌కి అర్ధం అయిందని సమాచారం.. దీంతో, ఓటుకి భారీగా నోట్ల కట్టలు ఎద జల్లుతున్నారని, నోటుతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.. మరి, లిక్కర్‌ డంప్‌.. జగన్‌ని పులివెందుల జడ్పీటీసీ గడప దాటిస్తుందా…?? లేదా..?? అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది..

Related posts

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

సింధు జలాల ఒప్పందం రద్దుతో కష్టాల్లో పాక్

Satyam News

Leave a Comment

error: Content is protected !!