26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

#KadapaPolice

Operation Mobi Track ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, మరియు డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌లో సఫలమయ్యారు. CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, మొత్తం 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడినవి, వీటి విలువ సుమారు రూ. 70,00,000/- ఉంటుంది.

ఇప్పటి వరకు “ 8 ” విడతల్లో మొత్తం రూ.11,76,00,000/- విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేయబడ్డాయి. “Operation Mobi Track” విజయవంతమైన ఆపరేషన్‌కు అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్స్, GPS ట్రాకింగ్, IMEI ట్రేసింగ్, మరియు సైబర్ నిఘా టూల్స్ కారణమని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ తెలిపారు.

సైబర్ క్రైమ్ టీం ఉపయోగించిన సైబర్ నిఘా టూల్స్ మరియు IMEI ట్రేసింగ్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో మంచి ఫలితాలను చూపిస్తుంది.

జిల్లాలో “మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల IMEI ఆధారిత ట్రాకింగ్ మరియు డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.

సైబర్ మోసాల భారిన పడకుండా ఉండేందుకు పోలీసు వారి సూచనలు:

సైబర్ మోసాల నుండి రక్షణ కోసం, అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్ / ఇమెయిల్స్‌కు ప్రతిస్పందించ వద్దు.

సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించాలి లేదా NCRP ( https://cybercrime.gov.in)   వెబ్సైట్ లో ఫిర్యాధు చేయండి.

మొబైల్ మిస్ అయినప్పుడు ( లేదా) దొంగతనం జరిగినప్పుడు తక్షణ కర్తవ్యంగా చేయవలసినవి:

బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయించాలి.

సిమ్ కార్డ్ నెంబర్‌ను ఆలస్యం చేయకుండా డిసేబుల్ చేయించుకోవాలి.

Google Pay, PhonePe వంటి UPI యాప్‌లకు/ అప్లికేషన్ లను 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలి.

మొబైల్ పోయిన తక్షణమే  గూగుల్ / ఆపిల్ ID, బ్యాంకింగ్ యాప్స్, వాట్సాప్, మెయిల్, సోషల్ మీడియా వంటి వాటి యొక్క పాస్‌వర్డ్లు మార్చండి.

ఆండ్రాయిడ్ ఫోన్లకు: Find My Device, ఐఫోన్‌లకు: Find My iPhone (iCloud) ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయడం, రింగ్ చేయడం, లాక్ చేయడం, లేదా డేటా డిలీట్ చేయడం చేయొచ్చు.

Ceir.gov.in పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ యొక్క వివరములతో ఫిర్యాదు చేయవచ్చు.

సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్తలు:

ఫోన్ బిల్లు, సెల్ ఫోన్ బాక్స్ మరియు ఫోన్ అమ్మే వ్యక్తి గురించి సరిగా పరిశీలించాలి.

అపరిచితుల నుండి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ సైబర్ క్రైమ్ టీం – ఇన్స్పెక్టర్  A. మధు మల్లేశ్వర రెడ్డి సిబ్బంది అందరిని అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పితో పాటుగా, అడిషనల్ ఎస్పి K. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి  N. సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ U. సదాశివయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

వైద్యులు నిర్లక్ష్యం మలేరియాతో యువకుడు మృతి

Satyam News

రూ.20 లక్షలతో పానీపూరీ వ్యాపారి పరార్!

Satyam News

విశాఖలో డ్రగ్స్ కలకలం: 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం

Satyam News

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

Satyam News

Leave a Comment