సంపాదకీయంహోమ్

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

#NandamuriBalakrishna

రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ పిలవగానే స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేశ్‌. బసవ తారకం క్యాన్సర్‌ హాస్పటల్‌ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి బాలకృష్ణ. ఈ మామ అల్లుళ్లు ఇద్దరూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో పోటీ పడుతున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని బాలయ్య బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజ్‌ దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు కేయాన్స్ ఆడ్విక్‌.. స్పైనల్‌ మస్క్యులర్‌ ఎట్రోపీ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ ఇవ్వాలి. ఇంత భారీ మొత్తాన్ని భరించే స్తోమత ఆ కుటుంబానికి లేదు.

ఈ పరిస్థితుల్లో చిన్నారి తల్లిదండ్రులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కలవగా.. ఆ కుటుంబానికి తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయడం ద్వారా చిన్నారి భవితకు బాటలు వేయాలని ప్రజలను కోరారు.

రెండు నెలల క్రితం ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్వికకు పెద్ద మనసుతో సాయం చేశారు మంత్రి నారా లోకేశ్. దాతల ద్వారా పునర్విక తల్లిదండ్రులు ఆరు కోట్లు సేకరించగా.. మిగిలిన పది కోట్లు తాను చూసుకొంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే దగ్గరుండి విదేశాల నుంచి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ తెప్పించి.. చిన్నారి పునర్వికకు చికిత్స చేయించారు.

ఆస్తుల కోసం పోట్లాడుకొనే రాజకీయ కుటుంబాలను చూస్తున్నాం.. పదవుల కోసం కొట్టుకొంటున్న పొలిటికల్‌ ఫ్యామిలీస్‌నీ చూశాం.. కానీ ప్రజలకు సేవ చేయడానికి పోటీ పడుతున్న మామా అల్లుళ్లుగా నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయం అంటే పదవులు, అధికారం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్న వారిని అదుకోవడం, కష్టాల్లో ఉన్న వారి సమస్యలు పరిష్కరించడమని చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇలాంటి నాయకులను అభినందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

Related posts

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

Satyam News

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

యుఏఈ తో భారత్ కీలక ఇంధన ఒప్పందం

Satyam News

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

Satyam News

Leave a Comment