అనంతపురంహోమ్

కూడేరు నీటి సమస్యపై జిల్లా కలెక్టర్‌కు వినతి

#VisweswarareddyYCP

అనంతపురం జిల్లా కూడేరు మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్లారు.

ఎండిపోతున్న బోర్లు, పండ్ల తోటలు, తాగునీటి ఇబ్బందులను కలెక్టర్ కి వివరించి, ముద్దలాపురం, కరుట్లపల్లి, ఇప్పేరు, అరవకూరు, సీర్పి చెరువులను హంద్రీ-నీవా నీటితో తక్షణమే నింపాలని కోరారు. రైతుల పంటలను, పండ్ల తోటలను కాపాడటంతో పాటు ప్రజలు, పశువుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి రమణ,జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

Satyam News

27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam News

సిరి మీడియా అక్రమాలపై దాసరి కుమారుడి ఫిర్యాదు

Satyam News

అంగరంగ వైభవంగా భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

Satyam News

వర్ష బాధితుల్ని పట్టించుకోని మంత్రి దామోదర

Satyam News

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

Satyam News

Leave a Comment