25.7 C
Hyderabad
September 25, 2026
ముఖ్యంశాలుహోమ్

కేరళలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ దేవాలయాన్ని, కలరిని మంత్రి సందర్శించారు.

అనంతరం శ్రీ మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు పొందారు. అనంతరం అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్ ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించారు. దాదాపు మూడు గంటలపాటు ఆశ్రమంలో గడిపారు.

Related posts

ముంబై బిజినెస్ సర్కిల్‌లో ఆంధ్రప్రదేశ్ ‘న్యూ ఫోర్స్’!

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

Satyam News

ఐఏఎఫ్‌కు త్వరలో 5 తేజస్ మార్క్–1ఏ యుద్ధవిమానాలు

Satyam News

సాయిబాబా భక్తుల మనోభావాలను గౌరవిస్తాం

Satyam News

క్యూర్ ప‌రిధిలో కొత్తగా ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఇక్కడే…

Satyam News

Leave a Comment