ప్రత్యేకంహోమ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి

#PavanKalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబానికి మరో పదవి దక్కింది. ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవలె నాగబాబును క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ ఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్ రిచ్ మెంట్ (ఏపీ గ్రీన్) కు కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నియమించారు. ఆయనకు గతంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా అది తీరకపోవడంతో ఏపీ గ్రీన్ లో పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించినప్పుడు జనసేన నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితకు నామినేటెడ్ పదవి వచ్చింది. ఆమెను విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

Satyam News

రెయిన్ బజార్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు

Satyam News

గీతం ఎమ్‌సిఎ విద్యార్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలు

Satyam News

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

Satyam News

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

Satyam News

Leave a Comment