32.2 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా వేదికకు డాక్టర్ రవి కుమార్ దాతగా వ్యవహరించి సహాయసహకారాలు అందించారు.

ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 13 మరియు 14 తేదీల్లో అయిజ లోని గుంత రామేశ్వర గుడి పక్కన ఉన్న మినీ పార్క్ ప్రాంగణంలో జరగనుంది. అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.

విజేతలకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.

ప్రథమ బహుమతి: ₹50,000 (SSC 1986-1987 బ్యాచ్ మిత్రులు).

ద్వితీయ బహుమతి: ₹30,000 (పెద్దపల్లి అజయ్).

తృతీయ బహుమతి: ₹20,000 (డాక్టర్ వి. అరుణ్ కుమార్ ఆచారి).

నాల్గవ బహుమతి: ₹10,000 (సుబ్రమణ్యం శెట్టి).

మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్‌కు పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

Related posts

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

లక్కిరెడ్డిపల్లిలో మహర్షి వాల్మీకి జయంతి

Satyam News

త్వరలో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ

Satyam News

Leave a Comment