చిత్తూరుహోమ్

తిరుచానూరు లో వైసీపీ గుండాల దౌర్జన్యం

తిరుచానూరులో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ సమీపంలో టిటిడి వాహన బేరర్లపై స్థానిక వైసీపీ తిరుచానూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. కేవలం సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో మొదలైన గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది.

పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ ముగిసిన తర్వాత చంద్రగిరి నుంచి వచ్చిన వాహన బేరర్లు తిరిగి వెళ్తున్నారు. గేట్ నంబర్ 1 వద్ద తిరుచానూరుకు చెందిన వైసిపి నేత వాసు అనే వ్యక్తితో సైడ్ ఇచ్చే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో వాసు తన అనుచరులను పిలిపించి వాహన బేరర్లపై దాడి చేయించారు. ఈ దాడిలో టిటిడి వాహన బ్యారర్లు మహేష్ అనే వ్యక్తి తల పగలగా, లవకుమార్ సహా 5 మందికి పైగా గాయపడ్డారు.

ఘటన గురించి తెలుసుకున్న వాహన బేరర్ల బంధువులు చంద్రగిరి నుంచి పెద్ద సంఖ్యలో తిరుచానూరు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుచానూరు వైసీపీ సర్పంచ్ తమ్ముడు నరేష్ రెడ్డి కూడా ఈ ఘటనలో ఉన్నాడు.

Related posts

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Satyam News

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

మీరాలం ట్యాంక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పర్యవేక్షించిన సీఎం

Satyam News

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

Satyam News

కల్పవృక్ష వాహనంపై కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News

రూ.20 లక్షలతో పానీపూరీ వ్యాపారి పరార్!

Satyam News

Leave a Comment