విజయనగరం హోమ్

ఎమ్మెల్సీ కోసం గ‌న్‌మేన్ వెతుకులాట‌

#MLC

ఒక ప్రజాప్ర‌తినిధిని నిరంతరం కంటికి రెప్ప‌లా కాపాడాల‌ని చ‌ట్టం చెబుతోంది. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగాప్ర‌జ‌ల  కొర‌కు ప్ర‌జ‌ల కోసం ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిదిని రక్షించుకోవ‌డం కోసం రూపొందించ‌బ‌డ్డ రాజ్యాంగ‌మే అంగ ర‌క్ష‌కుల‌ను నియ‌మించింది.

ఆ  ర‌కంగా ఏ ఎన్నిక‌ల‌లోనైనా గెలిచిన వారికి గ‌న్ మేన్ ల‌ను ప్రభుత్వ‌మే కేటాయిస్తోంది..కేటాయించింది కూడ‌. ఇక విష‌యానికి వ‌స్తే ఏపీలోని ఉత్త‌రాంద్ర టీచ‌ర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదె శ్రీనివాసుల నాయుడు ఒక్క‌సారి క‌నిపించ‌కుండా పోయారు విజ‌య‌న‌గ‌ర‌రంలో.

ఉత్త‌రాంద్ర క‌ల్పవ‌ల్లి,విజ‌య‌న‌గ‌రం ఇల‌వేల్సుశ్రీశ్రీశ్రీ  పైడిత‌ల్లి అమ్మ‌వారి అంకురార్ప‌ణ సంద‌ర్భంగా న‌గరంలోని మూడు లాంత‌ర్ల వ‌ద్ద ఉన్న చ‌దుర‌గుడి వ‌ద్ద ఉన్న టెంపుల్ వ‌ద్ద జ‌రుగుతున్న పందిర‌రాట సంద‌ర్భంగా ఈ ఆందోళ‌న‌క‌ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.

ప‌క్క‌నే, ర‌క్ష‌కుడిగా ఉండా్ల్సిన ఆర్మ‌డ్  రిజ‌ర్వ కేటాయించ‌న గ‌న్ మేన్ ఆ  జన సంద్రంలో ఒక్క‌సారి ప‌క్కకు చూసేస‌రికి త‌ను కంటికి రెప్ప‌లా కాపాడ‌వ‌ల‌సిన ఎమ్మెల్సీ లేరు. వెంట‌నే గుండె జారింది.అంతే టెంపుల్ చుట్టూర  వెతుకులాడారు. అక్క‌డే ఎమ్మెల్యే ఆదితీ రావడం,పందిర‌రాట వేసే కార్య‌క్ర‌మాన్ని  క‌వ‌రేజ్ చేస్తున్న మీడియా ప్ర‌తినిధుల‌ను కూడా ఆ గ‌న్ మేనే అడిగారు..సార్ ఎటువెళ్లార‌ని.. 

అప్ప‌టికీ కాన‌రాక‌పోవ‌డంతో పోన్ చేసి మ‌రీ ఆల‌య లోప‌ల‌కు వెళ్లారు. ఇలా దాదాపు అర‌గంట  త‌ర్వాత ఎమ్మ‌ల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు తాను క్షేమంగా ఉన్నాన‌ని చెప్ప‌డమే…ఎట్ట‌కేల‌కు దేవాల‌యం ఎదురుగా ఎస్వీఎన్ క‌ల‌ర్ ల్యాబ్ వ‌ద్ద క‌నిపించ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వ‌చ్చే నెల‌లోనే ఉత్త‌రాంద్ర ఆరాధ్య‌దైవం పైడిత‌ల్లి అమ్మ‌వారి పండ‌గ  జ‌ర‌గ‌బోతున్న వేళ‌….మ‌రి ముందే ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో చూడాలి మరి ప్ర‌జాప్ర‌తినిదులు బందోబ‌స్తుపై!

Related posts

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

Leave a Comment

error: Content is protected !!