ప్రత్యేకంహోమ్

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

#Modi

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన నిందితులకు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుతో ఆటలాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని, ప్రశ్నాపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టే పటిష్ఠ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్‌ యూజీ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ అంశంపై విస్తృతంగా చర్చించారని తెలిపారు. ప్రశ్నాపత్రం లీక్‌ వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి 13 మందిని అరెస్టు చేసిందని మోదీ గుర్తు చేశారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరగకుండా ఉండేందుకు నీట్‌ యూజీ పునఃపరీక్షను అత్యంత ప్రాధాన్యంతో నిర్వహించామని, ఫలితాల విడుదలలో కూడా ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసినట్లు ప్రధానమంత్రి వివరించారని తెలిపారు.

ఇకపై దేశంలో ఎక్కడా ప్రశ్నాపత్రాల లీకేజీలు జరగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించినట్లు రిజిజు వెల్లడించారు. కేసులో అరెస్టైనవారిపై బలమైన అభియోగాలు నిరూపించేందుకు అత్యుత్తమ న్యాయవాదులను నియమించాలని కూడా మోదీ సూచించినట్లు చెప్పారు. నిందితులు చట్టంలోని గరిష్ఠ శిక్షలను ఎదుర్కొనేలా ప్రభుత్వ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.

ప్రశ్నాపత్రాల లీక్‌ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని, రాష్ట్రాల్లో ఎక్కడ జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారని రిజిజు చెప్పారు. దీనిని రాజకీయ అంశంగా కాకుండా దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన జాతీయ సమస్యగా చూడాలని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారని వెల్లడించారు.

సమావేశంలో దేశ యువత ప్రతిభను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలో విశేష విజయాలు సాధిస్తున్న స్కైరూట్‌ అనే భారతీయ నవ్య సంస్థలో సగటు వయస్సు 28 సంవత్సరాలే ఉన్న యువ బృందం పనిచేస్తోందని, భారత యువత సామర్థ్యానికి ఇది గొప్ప ఉదాహరణ అని అన్నారు. దేశం సాధిస్తున్న విజయాలను ప్రజలకు మరింత విస్తృతంగా తెలియజేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

రానున్న వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఎన్‌డీఏ సానుకూల పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ అజెండాలో ఉన్న కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు కృషి చేస్తామని కిరణ్‌ రిజిజు తెలిపారు. దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన సంస్కరణల విషయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు

Satyam News

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

Satyam News

Leave a Comment