26.3 C
Hyderabad
September 19, 2026
శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

#Srikakulam

శ్రీకాకుళం నగరంలోని టిపిఎంహెచ్ పాఠశాలలో సోమవారం జేమ్స్ ఆస్పత్రి సహకారంతో టిడిపి నాయకులు కృప సాగరం నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి మహిళా నాయకురాలు గొండు స్వాతి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అనంతరం స్వాతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు.

31వ డివిజన్ ఇంచార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సూరిబాబు మాట్లాడుతూ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఇందిరమణి, బిజెపి నాయకులు సురేష్ సింగ్, వైద్యులు సోమేశు, టిడిపి కార్యకర్తలు రాము, పాపారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, తారక రామారావు, శ్రీధర్, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్స్ లో మాస్టర్ హెల్త్ చెకప్

Satyam News

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

Satyam News

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam News

జీఎస్టీ తగ్గించినా వసూళ్లు ఎందుకు పెరిగాయి?

Satyam News

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

Leave a Comment