26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

గూగుల్‌ని మించి అంబానీ భారీ పెట్టుబడి.!

##Ambani

ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వేత్తలకు ఏపీపై నమ్మకం పెరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఏకంగా ₹1.6 లక్షల కోట్ల (17 బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో 1.5 గిగావాట్ సామర్థ్యం కలిగిన గిగా-స్కేల్ AI డేటా సెంటర్ క్లస్టర్‌ను రిలయన్స్ ఏర్పాటు చేయబోతోంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా రికార్డు సృష్టించబోతోంది.

విశాఖ తీరాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్, దానికి IT శాఖ మంత్రి నారా లోకేశ్ వేగం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ చేస్తున్న ₹1.2 లక్షల కోట్ల పెట్టుబడిని మించి, రిలయన్స్ భారీ మొత్తంతో ముందుకు రావడం విశేషం. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులే నిదర్శనం.

విశాఖ కొత్త ఎయిర్‌పోర్టు భోగాపురం పరిసరాల్లో 935 ఎకరాల్లో నిర్మించనున్న ఈ క్లస్టర్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా సెంటర్ పాలసీ 4.0 ప్రధాన కారణం. ఐటీ మంత్రిగా లోకేశ్ అనుసరిస్తున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదం క్షేత్రస్థాయిలో అమలవుతోంది.

రిలయన్స్ కేవలం డేటా సెంటర్‌కే పరిమితం కాకుండా, దానికి అవసరమైన విద్యుత్ కోసం సుమారు ₹51,300 కోట్లతో సోలార్,  బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను కూడా రాష్ట్రంలోనే అభివృద్ధి చేయబోతోంది. మొత్తానికి చంద్రబాబు అనుభవం, లోకేశ్ ఆధునిక ఆలోచనల కలయికతో ఏపీ మళ్లీ ఐటీ పటంలో మెరిసిపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts

శివ‌రాత్రి సంద‌ర్బంగా గ‌ట్టి బందోబ‌స్త్‌

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News

Leave a Comment