25.2 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీ మదనగోపాలస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం

#ChintamaneniPrabhakar

ధర్మ పరిరక్షణ మరియు భక్తి భావనతోనే సమాజం సుభిక్షంగా ఉంటుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ధర్మపత్ని చింతమనేని రాధారాణి(రాధమ్మ) తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని దంపతులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని దంపతులు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దుగ్గిరాల గ్రామంలో ఈనెల 7,8 ,9 తేదీల్లో అనగా  గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజుల పాటు ఈ పునఃప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం భక్తులందరికీ భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుందని,  భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఆలయాల రక్షణకు మరియు సమాజంలో ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతమైన జీవనం సాధ్యమని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మెలిక వెనక…. అసలు కారణం ఇదే!

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

Leave a Comment