26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

#Rain

బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

Related posts

నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ఇండక్షన్ శిక్షణ

Satyam News

ఏపీకి మరో భారీ పరిశ్రమ….. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌

Satyam News

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News

కడప కోటిరెడ్డి సర్కిల్‌లో నిరసన జగన్ దిష్టి బొమ్మ దహనం!

Satyam News

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు

Satyam News

Leave a Comment