26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

#Tirumala

తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో.. మే నెలలో దాదాపు ప్రతి రోజు 80 వేల నుంచి లక్ష మంది వరకు స్వామివారి దర్శనం చేసుకొంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నా అందరికీ దర్శనాలు కల్పించడానికి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరుమలపై వైసీపీ అనేక కుట్రలకు తెరలేపింది. గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారు. కొండ మీద అన్యమతస్తులు ప్రార్ధనల వీడియోలు వైరల్‌ చేశారు. తిరుమలలో మద్యం సీసాలు పడేసి.. ఏడుకొండలను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ వైసీపీ కుట్రలే అని పోలీసుల విచారణలో తేలింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసి.. తిరుమల క్షేత్రం పవిత్రతను నాశనం చేయడానికి గొడ్డలి పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అంచంచల విశ్వాసం, నమ్మకం ఏమాత్రం తగ్గలేదని.. తిరుమలలో రద్దీని చూసి అర్ధం చేసుకోవచ్చు.

2014 నుంచి 2019 వరకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమల కేంద్రంగా వైసీపీ అనేక ఫేక్‌ ప్రచారాలు చేసింది. తప్పుడు ఆరోపణల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించారు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ఫేక్‌ ప్రచారాలు ఎవరూ నమ్మడం లేదు. ఐదేళ్ల జగన్‌ పాలనలో వందలాది హిందూ దేవాలయాలపై దాడులతో.. ఎవరు హిందువులో.. ఎవరూ హిందూ వ్యతిరేకులో భక్తులకు స్పష్టంగా అర్ధమైంది. మత మార్పిడి మాఫియాను ప్రోత్సహించే బ్యాచ్‌.. తిరుమల శ్రీవారి ఆలయం గురించి ఏం చెప్పినా నమ్మలేని పరిస్థితి తెచ్చుకున్నారు.

కులాల మధ్య కుంపట్లు పెట్టాలని చూసినా ఎవరూ స్పందించలేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ కార్యకర్తలకు.. నాయకత్వానికి మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక తిరుమల కేంద్రంగా చేస్తున్న కుట్రలు వైసీపీకే రివర్స్‌ అవుతున్నాయి. భక్తుల ముందు ఫ్యాన్ పార్టీ నాయకత్వమే బద్నాం అవుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీతో మహాపాపం చేసిన.. వైసీపీ బ్యాచ్‌కి తగిన శాస్తి చేసేందుకుం శ్రీవారి సేవకులు సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

Related posts

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News

ఈ రోజు లోకేశ్ – రేపు చంద్రబాబు – ఢిల్లీకి!

Satyam News

దక్షిణ్ ఎనర్జీ ప్రమాద బాధితులకు న్యాయం చేస్తాం

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్ర చికిత్స

Satyam News

వైసీపీ ఫేస్ బుక్ పేజీ ని బ్లాక్ చేసిన మెటా

Satyam News

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

Satyam News

Leave a Comment