కడపహోమ్

బాబు దయతో బతికిపోయి…. జగన్‌ కుట్రలు, కుతంత్రాలు!

#YSJagan

నేను మంచివాడిని.. బుద్ధుడిని మించిన శాంతి స్వరూపుడిని అంటూ జగన్‌ తనకు తాను సెల్ఫ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చుకొనే ప్రయత్నం రివర్స్ అయింది. తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి కాలం నుంచి జగన్‌ జమానా వరకు వైఎస్ కుటుంబం చేసిన హత్యలు, అకృత్యాలు, అరాచకాలు, అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది.

వైఎస్ ఫ్యామిలీ దుర్మార్గాలకు బలైపోయిన బాధితులంతా.. ఆ రాక్షసులు చేసిన దారుణాలకు బలైపోయిన తమ వాళ్లను తలచుకొని.. కన్నీటిపర్యంతం అవుతూ తమ కష్టాలు, నష్టాల గురించి కథలు కథలుగా చెబుతున్నారు.

ఇలా బయటకు వస్తున్న స్టోరీల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి.. 90వ దశకంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతి పరులను ఎంత దారుణంగా హత్య చేశారో కడప జిల్లా వాసులు వివరిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హత్యా రాజకీయాలు ఆగలేదని.. ఇందుకు పరిటాల రవి హత్యను ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తున్నారు.

అలాంటి రక్త చరిత్ర కలిగిన జగన్‌.. చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించడంపై తెలుగుదేశం నాయకుడు బీటెక్‌ రవి మండిపడ్డారు. వైఎస్‌ ఫ్యామిలీ అరాచకాలకు బలైపోయిన వాళ్లంతా ప్రతీకారంతో రగిలిపోతున్న సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్లను ఆపడం వల్లనే ఈ రోజు జగన్‌ ఉన్నారనీ.. బాబుగారు అడ్డం పడకపోతే.. ప్రత్యర్ధుల తొలి టార్గెట్‌ జగనే అయ్యేవాడని బీటెక్‌ రవి గుర్తు చేశారు.

చంద్రబాబు మంచితనంతో బతికి పోయిన జగన్‌.. ఆయన దయ వల్లే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగి.. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడం జగన్‌ ఎలాంటి వాడో తెలిజేస్తోందని అంటున్నారు. మేలు చేసిన వారికి కీడు చేయడంలో జగన్‌ తర్వాతే ఎవరైనా అని ఆరోపిస్తున్నారు. మద్దెలచెరువు సూరి, మొద్దు శీను దగ్గర నుంచి గంగిరెడ్డి వరకు ఎంతో మంది అనుమానాస్పదంగా మరణించారు. వీరంతా జగన్‌ ప్రత్యర్ధులను హత్య చేసి రాజకీయంగా ఆయనకు తిరుగులేకుండా చేసిన వాళ్లే.

కిరాయి హంతకుల సంగతి పక్కన పెట్టినా.. సొంత తల్లిని, జైల్లో ఉండగా పార్టీని నిలబెట్టిన చెల్లిని కూడా గెంటేసిన ఘన చరిత్ర జగన్‌ సొంతం. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని పట్టించుకోని వైనం అందరూ చూశారు. ఇప్పుడు పవర్ పోయిన పోయినా వైసీపీ హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. అక్రమంగా ఆక్రమించిన ఆస్తుల కోసం కడపలో పెద్ద దస్తగిరిని హత్య చేసిన ఉదంతం వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌… జగన్‌ అరాచకాలు నోమోరు అంటున్నారు సీఎం చంద్రబాబు.

Related posts

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

Satyam News

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

Leave a Comment