1925 విజయదశమి రోజున ఆర్.ఎస్.ఎస్ స్థాపితం అయి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ శతాబ్ది ఉత్సవంలో అడుగు పెట్టిన సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆర్.ఎస్.ఎస్ యూనీఫాం ను వాళ్లంతట వాళ్లే కొనుక్కోవడం ఆపై కుట్టించుకోవడం కోసం గణవేష్ అభియాన్ కార్యక్రమాన్ని సంఘ్ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వయం సేవకులు. శ్రీకారం చుట్టారు
తమ తమ బస్తీలలోనూ,నగరాలలోనూ, ఖండ్,జిల్లా,విభాగ్,రాష్ట్రం వారీగా ఇలా ప్రతీ చోట ప్రతీ ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త లక్ష్యం…ప్రతీ ఒక్కరిచే గణవేష్ కలిగి ఉండటం.ఇటీవల నాగపూర్ లో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచారక్ ల సమావేశంలో తీసుకున్ననిర్ణయం..
సంఘ్ ఆదేశాలు ఏంటంటే..ఈ దసరా లోపు ప్రతీ ఒక్కరి చే గణవేష్ కలిగి ఉండటం ఆపై సంపర్కం చేసి మరీ రుసుము తీసుకుని కుట్టించుకులా చేయాలన్నదే సంకల్పం. ఆ ఆదేశాలను సంఘ్ పెద్దలు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు స్వయంసేవకులు.
అందులో భాగంగా గడిచన వారం రోజులనుంచీ ప్రతీ చోటకు ప్రతీ ఒక్కరి వద్దకు వెళ్లి గణవేష్ ఉందా..? అయితే కుట్టించుకోండి..రుసుము కేవలం 900 రూపాయలనే అని చెప్పి.మరీ యూనీఫాం ఉండేలా కంకణం కట్టుకున్నారు.వివిధ క్షేత్రాల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో ఈ గణవేష్ అభియాన్ లో అందరూ భాగస్వాములువుతున్నారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో అయిదు ఉపనగరాలలో ఉన్న సంఘ్ కార్యకర్తలు ప్రతీ ఒక్కరిచే యూనీఫాం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.సేవా ప్రముఖ్ లు అయిన ప్రముఖ వీడియా గ్రాఫర్ అప్పరావు, స్కూల్ గుమస్తా ఉమాశంకర్, ఆలయ ట్రస్టీ చైర్మన్,సంఘ్ నగర సంఘ్ చాలక్ భగవాన్ తదితరలు అభియాన్ కార్యక్రమం చేపట్టారు.
తోటపాలెం లో ప్రముఖ కిరాణ స్టోర్స్ అధినేత నగేష్, బాలాజీనగర్ శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ఉన్న వారితో ఇలా చాలా మందిచే గణవేష్ అభియాన్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.