హైదరాబాద్హోమ్

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీస్ అకాడమీలో ఆధునిక శిక్షణ

#PoliceAcademy

తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)లో కానిస్టేబుల్ నుండి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న కాల్ డీటైల్ రికార్డులు (CDR), ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటైల్ రికార్డులు (IPDR), టవర్ డంప్ విశ్లేషణ, సోషల్ మీడియా ప్రొఫైలింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్ అనాలిసిస్ వంటి అంశాలపై నాలుగు రోజుల పాటు ఫాస్ట్ ట్రాక్ శిక్షణ కార్యక్రమం బుధ వారం రోజున విజయవంతంగా ముగిసింది.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం సైబర్ నేరాల దర్యాప్తులో ఫీల్డ్ అధికారుల సామర్థ్యాలను పెంపొందించేందుకు రూపొందించారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇన్‌స్పెక్టర్లు ఆధునిక సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా విశ్లేషించి నేరాలను ఛేదించేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా పొందుతున్నారు.

ఈ 5వ బ్యాచ్‌లో మొత్తం 31 మంది అధికారులు శిక్షణ పొందారు. వీరిలో 1 ఇన్‌స్పెక్టర్, 6 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 3 మంది హెడ్ కానిస్టేబుళ్లు మరియు 21 మంది పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు.

కోర్సు ముగింపు కార్యక్రమం కోర్సు డైరెక్టర్ వి. భాస్కర్, డీఎస్పీ, కోర్సు కోఆర్డినేటర్, సైబర్ నిపుణుడు ప్రగతి రతన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నేటి కాలంలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, సోషల్ మీడియా ఆధారిత నేరాలు, వైట్ కాలర్ క్రైమ్స్ మరియు ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసుల దర్యాప్తులో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు.

కాల్ డీటైల్ రికార్డులు (CDR), ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటైల్ రికార్డులు (IPDR), టవర్ డంప్ విశ్లేషణ, సోషల్ మీడియా ప్రొఫైలింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్ అనాలిసిస్ వంటి అంశాలపై శిక్షణ పొందిన అధికారులు తమ యూనిట్లలో నేరాల దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్  మార్గదర్శకత్వంలో ప్రతి నెలా ఇటువంటి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు తమ ఫీల్డ్ సిబ్బందిని ఈ కోర్సులకు పంపించి ఆధునిక సైబర్ దర్యాప్తు పద్ధతులపై శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని కోర్సు డైరెక్టర్ వి. భాస్కర్ కోరారు.

ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా పోలీసు అధికారులు సాంకేతిక ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించడం, డిజిటల్ నేరాలను వేగంగా ఛేదించడం మరియు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు.

Related posts

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News

రెవెన్యూ లోటు తగ్గించడం గొప్ప విషయం

Satyam News

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News

‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్: ఇష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు

Satyam News

హైదరాబాద్ పోలీసులతో కలిసి పని చేస్తారా?

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

Leave a Comment