26.7 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

నిర్ణీత కాల వ్యవధి లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి

#GottipatiRaviKumar

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు.

అలానే అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో బుధవారం ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని సుమారు 30 ప్రధాన ఆస్పత్రుల్లో జనరేటర్ల పనితీరును సమీక్షించి, కరెంట్ నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అలాగే విద్యుత్ శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేయడానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.

వేసవికాలంలో ఎదురైన విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి, సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి సారించాలని కోరారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ప్రజలపై అదనపు భారం మోపకుండా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

జొన్న‌గుడ్డిలో కార్డ‌న్ సెర్చ్‌: ఆరుగురిపై స‌స్పెక్ట్స్ షీట్స్‌

Satyam News

రాష్ట్రంలో ద‌శ‌ల వారీగా భూముల రీసర్వే

Satyam News

రేవంత్ రెడ్డికి ఘాటు లేఖ రాసిన కిషన్ రెడ్డి

Satyam News

హత్య కేసులో నిందితులు అరెస్టు

Satyam News

పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రవికుమార్

Satyam News

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

Leave a Comment