తూర్పుగోదావరిహోమ్

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

#SanaSatish

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక (విఘ్నేశ్వర) స్వామి వారిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దంపతులు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారిని పూజించారు.. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాజోలు టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, బీజేపీ నాయకులు యాళ్ల దొరబాబు, తాడి నరసింహారావు, మోకా సుబ్బారావు, గన్నవరం కోఆర్డినేటర్ టి.వి. సత్యనారాయణ, మద్దాల సుబ్బారావు, చిట్టూరి శ్రీను, మద్దాల రాజా, తిక్కిరెడ్డి వాసు, గనిశెట్టి అరవింద్, భజరంగ్ దళ్ నాయుడు, మండేల బాబీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవమల్లెతీగ 100వ సంచికను ఆవిష్కరించిన మంత్రి సవిత

Satyam News

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News

అనంతబాబు కోసం దళితులకు జగన్‌ అన్యాయం.!

Satyam News

విద్యా రంగంలో భారీ పెట్టుబడులకు సాయం చేయండి

Satyam News

శ్రీలక్ష్మిని భూమన అవమానిస్తే సాక్షి సిగ్గుపడిందా?

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment