హైదరాబాద్హోమ్

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2న

#SriUjjainiMahankaliTemple

సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2 వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆలయ పండితులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లేఖను అందజేశారు. జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3 వ తేదీన రంగం (భవిష్య వాణి) ఉంటాయని EO వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Related posts

జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ  డైరీ ఆవిష్కరణ

Satyam News

మిడిల్‌ ఈస్ట్ సంక్షోభం….. ఏపీకి గల్ఫ్ డేటా సెంటర్లు

Satyam News

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News

కలెక్టర్ కు పిర్యాదు చేసినా చర్యలు నిల్

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

బోటు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎంఎల్ఏ

Satyam News

Leave a Comment