26.3 C
Hyderabad
September 19, 2026
కరీంనగర్హోమ్

రాజన్నల సంఘ భవనానికి భూమి పూజ

#MedipalliSatyam

చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రాజన్నల సంఘ భవనం మరియు నాయీ బ్రాహ్మణ సంఘ భవనాల నిర్మాణ పనులకు నేడు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం  భూమి పూజ చేశారు.

తదుపరి చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కొలిమికుంట గ్రామంలో జరుగుతున్న ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి పట్నాలకు హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నిజానపురం చందు, మున్సిపల్ పాలక వర్గం, మార్కేట్ కమిటీ సభ్యులు,  వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Related posts

రాష్ట్రంలో ద‌శ‌ల వారీగా భూముల రీసర్వే

Satyam News

ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ

Satyam News

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందా?

Satyam News

Leave a Comment