హైదరాబాద్హోమ్

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి

#Gachibowli

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా సాధనలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక యోగ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో  భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ సోసైటీ, హెల్తీ తెలంగాణ ఉండాలన్నారు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులకు యోగాను పరిచయం చేస్తున్నామన్నారు. యోగ గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా కృషి చేస్తున్నామన్నారు.ఆయుష్ శాఖ ద్వారా యోగ శిక్షణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా క్రిస్టినా జెడ్ చొంగ్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హనుమంతు, డైరెక్టర్ స్పోర్ట్స్ సోనీ బాలాదేవి, మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్, రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా. రవీంద్ర కుమార్, ఆయుష్ శాఖ అధికారులు  హైదరాబాద్ జిల్లా DMHO డా. పుట్ల శ్రీనివాస్, యోగ శిక్షకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

గద్వాల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

మొట్టమొదటి ఏఐ-ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ

Satyam News

పరిశ్రమల మనుగడకు పటిష్ట నీటి నిర్వహణే కీలకం

Satyam News

ఆర్ధిక నేరంలో అందమైన భామల విచారణ లేదు…

Satyam News

చరిత్రలో రథసప్తమి….. ప్రత్యేకత

Satyam News

Leave a Comment