26.3 C
Hyderabad
September 19, 2026
అనంతపురంహోమ్

రూ. 2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

#RedSanders

అనంతపురం జిల్లా బొంతవాడ గ్రామ శివార్లలో 108 ఎర్రచందనం దుంగలు డంప్ పై టాస్క్ ఫోర్స్ దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు అనంతపురం జిల్లా స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రెడ్ శాండిల్  టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి బుక్కరాయ సముద్రం మండల రేగిడి కొత్తూర్ కు చెందిన నల్లాని నంద కుమార్( 32)ను పట్టుకున్నారు. అతని తో పాటు నల్లాని జయ రామయ్య,  బొట్టు రాఘవేంద్ర లను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో, ఎర్ర చందన అక్రమ రవాణా నిరోధక దళం (RSASTF)  హెడ్ ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు మార్గదర్శకత్వంలో, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఎస్పీ పీ. శ్రీనివాస్,  ఆడిషినల్  జె. కులశేఖర్ ఆధ్వర్యం లో శేషాచల అడవులలో ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహించడం తో పాటు, ఎర్ర చందనం కేసు లలో ముద్దాయిలు గా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న అంతర రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

అందులో భాగంగా 24 వ తేదీ సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందం, అటవీ సిబ్బంది కి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అనంత పురం జిల్లా, నార్పల మండలం, బొందల వాడ గ్రామ పొలిమేరలో అదుపులోకి తీసుకోని వారి నుండి ఒక కారు తో సహా 109 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

వీరంతా ఒక ముఠా గా ఏర్పడి ఎర్ర చందనం చెట్లు నరికించి వాటిని డంప్ గా చేసి ఎక్కువ మొత్తం లో డబ్బులకు డిల్లీ, తమిళనాడు  కర్ణాటక కు చెందిన భడా ఎర్ర చందనం స్మగ్లర్లు కు అమ్ముతున్నారు. మొత్తం 109 ఎర్రచందం దుంగలు పట్టుకోగా రవాణా చేస్తున్న వాహనం తో సహా  విలువ సుమారు 2 కోట్లు గా  ఉంటుందని అంచనా వేయడం జరిగింది.

Related posts

పవన్ కల్యాణ్ పై విమర్శలకు చంద్రబాబు సమాధానం

Satyam News

నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News

Leave a Comment