25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

#CBN

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు కౌంట్‌డౌన్ షురూ అయింది. పేద, మధ్యతరగతి కుటుంబాల తలరాతలను మార్చేస్తూ..విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏకంగా రూ.10,000 కోట్ల భారీ నిధులను నేరుగా జమ చేసేందుకు విద్యాశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మెగా డిజిటల్ ఆర్థిక విప్లవానికి తెర లేవబోతోంది.

వైసీపీ ప్రభుత్వాల నిబంధనలకు పాతరేస్తూ, ప్రస్తుత కూటమి సర్కార్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ రూ. 15,000 చొప్పున సాయం అందించబోతోంది. ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా సరే.. ఏ ఒక్క బిడ్డకూ అన్యాయం జరగకుండా అందరికీ ఈ నగదును వర్తింపజేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా తల్లుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇప్పటికే విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫారాలు, షూస్, బ్యాగులు అన్నీ ఉచితంగా అందుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా తల్లికి వందనం నగదు కూడా నేరుగా అకౌంట్లలో పడుతుండటంతో పేద తల్లిదండ్రులకు చదువుల భారం పూర్తిగా తప్పింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా బడులను తీర్చిదిద్దడమే కాకుండా, ఇలాంటి అండను ఇవ్వడంపై ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఈ నెల 22న జరగబోయే ఈ భారీ నగదు బదిలీ కోసం విద్యాశాఖ ఇప్పటికే అర్హులైన విద్యార్థులు, తల్లుల బ్యాంక్ ఖాతాల వెరిఫికేషన్ ప్రక్రియను పక్కాగా పూర్తి చేసింది. ఒకే రోజు రూ. 10,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ప్రజల చేతుల్లోకి వెళ్తుండటంతో, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊపునిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వంద శాతం అక్షరాస్యతే లక్ష్యంగా, బడి బయట ఒక్క పిల్లవాడు కూడా ఉండకూడదనే కూటమి ప్రభుత్వ సంకల్పానికి ఈ పథకం ఒక బలమైన పునాది కాబోతోంది.

Related posts

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

21న యాక్షన్ కింగ్ అర్జున్ ఐశ్వర్య రాజేష్’ల “మఫ్టీ పోలీస్”

Satyam News

చంద్రబాబుకు రిలయన్స్ అదిరిపోయే గిఫ్ట్

Satyam News

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News

ఉగ్రవాదుల దొంగ దెబ్బకు ఓ పోలీసు బలి

Satyam News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Satyam News

Leave a Comment