కడపహోమ్

పెండింగ్ పనుల పూర్తికి ప్రాధాన్యత

#KadapaMayor

మార్నింగ్ విజిట్ లో భాగంగా 46 వ డివిజన్  లోని శాస్త్రి నగర్ & అక్కాయపల్లె పరిసర ప్రాంతాలలో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పర్యటించారు. 46 వ డివిజన్ లోని దర్గామిట్ట ప్రాంతంలోని జాఫర్ ఖాన్ మసీదు వద్ద MP ల్యాండ్స్ నిధులలో 2 లక్షల రూపాయలతో CC రోడ్ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ పాక సురేష్ కుమార్ మాట్లాడుతూ 46 వ డివిజన్ అక్కాయ పల్లె పంచాయతీ ఉన్నపటి నుంచి శాస్త్రి నగర్ & అక్కాయ్య పల్లె ప్రాంతాలు ఎక్కువ గా విస్తరించి డివిజన్ పెరిగిపోతూ వస్తుంది, ఎమ్మెల్సీ మాజీ కార్పొరేటర్ నాగమల్లారెడ్డి చొరవతో 10 సంవత్సరాల నుండి డివిజన్లో అనేక సీసీ రోడ్లు & కాలువలు నిర్మించారు.

ఇంకా వేయవలసిన రోడ్లు చాలా ఉన్నాయని ఈరోజు మార్నింగ్ విజిట్ లో పరిశీలించగా ఎంపీ లాండ్స్ లో 2 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్స్ లో సీసీ రోడ్ & డ్రైనేజ్ ల కొరకు 25 నుంచి 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని అని మేయర్ తెలిపారు.

స్థానిక నాయకులు చోటు, వెంకట్రావు, నారాయణమ్మ, మల్లేశ్వర రెడ్డి సదరు కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ లో ఉండడం వలన  పనులు చేయడం లేదని మేయర్ దృష్టి కి తీసుకురాగా ఇంజనీరింగ్ విభాగ అధికారులు AE నిరూపతో కాంట్రాక్టర్ బిల్లులు క్లియర్ చేయించి పనులను ప్రారంభించే విధంగా చేయాలని మేయర్ ఆదేశించారు.

డివిజన్ లో విజిట్ లో పరిశీలించగా శానిటేషన్ అధ్వానంగా ఉండడం వలన శానిటేషన్ ఇన్స్పెక్టర్ చలపతి, సెక్రెటరీ లను క్లీన్ చేయించాలని మేయర్ ఆదేశించారు. 46 వ డివిజన్ లో మూడు క్లాప్  ఆటోలకు 6 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం వలన డివిజన్ లోని రోడ్లు డ్రైనేజ్ లు క్లీన్ చేయడానికి ఇబ్బంది కలుగుతుందని మూడు ఆటోలను రెండు ఆటోలకు కుదించి డివిజన్ శానిటేషన్ పనులు క్లీన్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని MHO రమేష్ ని మేయర్ ఆదేశించారు.

డివిజన్ విస్తరించి  ఉండడం వలన లే అవుట్ లు లేకుండా ఇష్టానుసారం ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వారికి ఖాళీ జాగలలో డ్రైనేజ్ వాటర్ చేరడం  వలన చెట్లు పెరిగి పోయి విష పురుగులు తిరుగుతున్నాయని ఖాళీ జాగా యజమానులకు నోటీసులు జారీ చేసి క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని TPBO శ్రీకాంత్ ని మేయర్ ఆదేశించారు.

ఈ మార్నింగ్ విజిట్ కార్యక్రమంలో కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జిలు రంజన్ రెడ్డి, బాలస్వామి రెడ్డి , శ్రీనివాసులు రెడ్డి, సచివాలయ సెక్రెటరీ లు & అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

Satyam News

వైభోగ జీవితంలోని కాళ రాత్రులు!

Satyam News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

Satyam News

War effect: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

Satyam News

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

Satyam News

Leave a Comment