సంపాదకీయంహోమ్

కాపులపై ప్రేమ కాదు… వైసీపీ పక్కా కుట్ర!

#Jagan

సాక్షి మీడియా రోజు రోజుకూ దిగజారుతోంది. సమాజంలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా దానికి వెంటనే కులం రంగు పూసి, కాపు సామాజిక వర్గానికి, తెలుగుదేశం పార్టీకి మధ్య తీవ్రమైన వైషమ్యాలు సృష్టించడమే లక్ష్యంగా కథనాలను వండివారుస్తున్నారు. ఈ రాతల వెనుక కాపులపై ఉన్నది ఎంతమాత్రం ప్రేమ కాదని, కేవలం కూటమిపై విషం చిమ్మి రాజకీయ లబ్ధి పొందాలనే రాక్షస కుట్ర మాత్రమేనని స్పష్టమవుతోంది.

గతంలో ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదాన్ని సైతం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దారుణంగా వాడుకున్నారు. సాధారణ ప్రమాదంగా చూడాల్సిన ఘటనకు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి కాపు యువకుడిని చంపేశారు అంటూ కులాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ శీర్షికలు ఖరారు చేయడం వెనుక ఉన్నది కాపులపై జాలి కానే కాదు. అలాగే సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలోనూ చట్టపరమైన విచారణను, నిజానిజాలను పక్కనబెట్టి, కేవలం కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి వీధుల్లోకి తెచ్చేలా వార్తలను మలచడం ఈ పక్కా ప్లాన్‌లో భాగమే.

గతంలో కాపులపై అక్రమ కేసులు బనాయించినప్పుడు, అణచివేతకు గురిచేసినప్పుడు నోరు మెదపని బ్లూ మీడియా, ఇవాళ సడన్‌గా కాపుల పరిరక్షకురాలిగా ముసుగు వేసుకోవడం వెనుక ఉన్నది నకిలీ ప్రేమ మాత్రమే. కాపు యువత భవిష్యత్తు లేదా క్షేమం కంటే, వారిని ప్రభుత్వంపై ఉసిగొల్పి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడమే ఈ ‘విషపు జర్నలిజం’ ప్రధాన లక్ష్యం. కాపులు-టీడీపీ మధ్య నమ్మకాన్ని దెబ్బతీసి, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే ఈ వార్తల వెనుక ఉన్న అసలు ఎజెండా.

1780లో వచ్చిన హిక్కీస్ బెంగాల్ గెజిట్ నుంచి ఇవాల్టి వరకు పత్రికారంగం బాధ్యతాయుతంగా నడిస్తే, సాక్షి మాత్రం సమాజంలో విద్వేషాలు నింపే కేంద్రంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతల సమస్యలను కుల పోరాటాలుగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ఈ కుట్రపూరిత కథనాల వెనుక ఉన్నది కాపులపై ప్రేమాభిమానాలు కావని, ఇది రెండు వర్గాల మధ్య శాశ్వత శత్రుత్వాన్ని పెంచే పక్కా ప్లాన్ అని కాపు సామాజిక వర్గం స్పష్టంగా గుర్తిస్తోంది.

Related posts

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News

హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

Satyam News

దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ

Satyam News

విశాఖ నగరంలో వెహికల్ రిటర్న్ మేళా

Satyam News

ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?

Satyam News

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

Satyam News

Leave a Comment