కరీంనగర్హోమ్

బీజేపీ అధికారంలోకి వస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు

#BandiSainjai

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్య సేవలు అందిస్తామని ప్రకటించారు.

శనివారం కరీంనగర్‌లోని పద్మశాలి సంఘం భవనం పై అంతస్తులో నూతనంగా నిర్మించిన గదులను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, అధికారంలో లేకపోయినా ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి సహకరించానని తెలిపారు.

ఇతర కుల సంఘాలకు కూడా తన వంతు సాయం అందించానన్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతోపాటు గుడి, బడి, ఆసుపత్రుల సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సంక్షోభంలోకి వెళ్లిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ప్రశ్నలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించాలా? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? రెండు, మూడు ఓట్లు కలిగిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలా? 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలా? అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు.

23న నితిన్ నబిన్ పర్యటన

SIRపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్‌కు వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా పాదయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related posts

ఎన్నికల ఫలితాల వేళా బెంగళూరుకే జగన్ పరిమితం

Satyam News

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

Satyam News

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

Satyam News

Leave a Comment